Tollywood Movies: సరైన సమయంలో రిలీజ్ కాకపోవడం వల్ల మరీ భారీగా కలెక్షన్లు సాధించని సినిమాలివే!
TeluguStop.com
మామూలుగా కొన్ని కొన్ని సార్లు సినిమాలు అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా విడుదల అవుతూ ఉంటాయి.
కొన్నిసార్లు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసినప్పటికీ అంతకంటే ముందుగానే కూడా విడుదల అవుతూ ఉంటాయి.
అయితే ఎక్కువ శాతం సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి.అయితే కొన్ని కొన్ని సార్లు సినిమాలు విడుదల చేసినప్పటికీ సరైన సమయంలో విడుదల కాకపోవడం వల్ల కలెక్షన్లు సాధించకపోవడం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
సినిమా హిట్ అయినప్పటికీ ఆ సినిమాల కంటే పెద్ద సినిమాలో విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించినప్పుడు ఆటోమేటిక్గా ఆ సినిమాకు కలెక్షన్లు పడిపోతూ ఉంటాయి.
అటువంటి సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇందులో చల్ మోహన్ రంగా సినిమా( Chal Mohan Ranga ) కూడా ఒకటి.
ఈ సినిమా రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా సమయంలో విడుదల అయింది.
రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రేక్షకులు సినిమా వైపు ఎక్కువగా మొగ్గు చూపారు.
దీంతో ఈ సినిమా కలెక్షన్లు కూడా లేకపోవడంతో డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా కాస్త ఆగి విడుదల చేసి ఉంటే దీని రిజల్ట్ మరోలా ఉండేదని చెప్పవచ్చు.
రామ్ పోతినేని నటించిన మస్కా సినిమా( Maska Movie ) అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సినిమా కేవలం రెండు రోజుల తేడాతో విడుదల అయినా కూడా మస్కా సినిమాను పట్టించుకునే ప్రేక్షకుడే లేకుండా పోయాడు.
"""/" /
అరుంధతి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.మస్కా సినిమా కనక కొంచెం ఆలస్యంగా విడుదల చేసి ఉంటే కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాగానే సక్సెస్ సాధించేది.
అలాగే బాలయ్య బాబు నటించిన సింహ ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి.
సింహ సినిమా ఎఫెక్ట్ వల్ల సూపర్ హిట్ అవ్వాల్సిన డార్లింగ్ సినిమా( Darling Movie ) పరవాలేదు అనిపించుకుంది.
ఒకవేళ డార్లింగ్ సినిమాను కాస్త ఆలస్యంగా విడుదల చేసి ఉంటే ఆ కథ వేరేగా ఉండేది.
"""/" /
అదేవిధంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా థియేటర్లలో రన్ అవుతున్న సమయంలో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాను( Shyam Singha Roy ) విడుదల చేశారు.
దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా వెనకబడిపోయింది.కాస్త ఆలస్యంగా విడుదల చేసి ఉంటే ఈ సినిమా మంచి సక్సెస్ సాధించేది.
అలాగే టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమా విడుదల అయ్యే సమయానికి బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి, లియో సినిమాలు ఒకేసారి విడుదల కావడంతో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
పొడవాటి జుట్టును కోరుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవడం మిస్ అవ్వకండి!