సక్సెస్ టూర్ లో హీరో గల్లా అశోక్.. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న దేవకీ నందన వాసుదేవ మూవీ!

గతవారం మూడు మిడ్ రేంజ్ సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విభిన్న కథాంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి.

ఇకపోతే గతవారం విడుదలైన సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్( Galla Ashok ) నటించిన దేవకీ నందన వాసుదేవ( Devaki Nandana Vasudeva ) సినిమా కూడా ఒకటి.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.

"""/" / విభిన్న కథాంశంతో మాస్ యాక్షన్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా డీసెంట్ టాక్ ని తెచ్చుకుంది.

కానీ హీరోగా గల్లా అశోక్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.గత సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాకు గల్లా అశోక్ బాగానే పరిణీతి చెందాడని చెప్పాలి.

ఇక ఈ దేవకి నందన వాసుదేవా సినిమాలో ఎమోషన్స్ ని బాగా పలికించడంతోపాటు, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

గత సినిమా హీరో మూవీ కంటే ఈ సినిమాలో ఇంకా అందంగా కనిపించారు గల్లా అశోక్.

కాగా విడుదలైన మొదటి రోజు ఈ సినిమాకు చాలా వరకు నెగటివ్ టాక్ వచ్చింది.

"""/" / కానీ నెమ్మదిగా రెండవ రోజు కలెక్షన్లు కాస్త పుంజుకోవడంతో మూడవ రోజు కలెక్షన్లు మరింత ఎక్కువ రాబట్టింది ఈ మూవీ.

దీంతో నెమ్మది నెమ్మదిగా ఈ సినిమాలకు ప్రేక్షకులు క్యూ కట్టడం మొదలుపెట్టారు.మొదట ప్రమోషన్స్ సమయంలో నెమ్మదించిన మూవీ మేకర్స్ కలెక్షన్స్ లో బాగా వస్తుండటంతో ఈ సినిమాను ప్రేక్షకులలోకి మరింతగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యంగా బీ,సీ సెంటర్స్ లో దేవకీ నందంన వాసుదేవ వీకెండ్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి.

ఇక వర్కింగ్ డేస్ లోనూ డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది.కమర్షియల్ సినిమా కి డివోషనల్ టచ్ ఇవ్వడం భారీ యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.

దానికి తోడు ఈ వీకెండ్ లో సినిమాలు ఏవి లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం హీరో హీరో గల్లా అశోక్ తెలుగురాష్ట్రాల్లో సక్సెస్ టూర్ చేపట్టాడు.

అందులో భాగంగా థియేటర్స్ విజిట్ చేస్తున్నాడు.ఆ ఊరు ఈ ఊరు అని తేడా లేకుండా ఈ సక్సెస్ టూర్ లో గల్లా అశోక్ కు ప్రేక్షకులు బ్రమ్మరథం పడుతున్నారు.

అక్కడ పుష్ప ది రూల్ మూవీ టికెట్ రేటు ఏకంగా రూ.3000.. అసలేం జరిగిందంటే?