హైదరాబాద్ లో దారుణం: కూతురుని లాక్కెళ్లి, కోరిక తీర్చాలంటూ తల్లిని....

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదు నగరంలో మహిళలపై జరుగుతున్నఆకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

అంతేగాక మహిళలపై అత్యాచారాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాలు మరియు పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినప్పటికీ మహిళలపై జరిగేటువంటి లైంగిక దాడులకు మాత్రం అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

తాజాగా ఓ మహిళ తన కూతురుతో కలిసి రోడ్డుమీద వెళుతుండగా తన కూతురుని బలవంతంగా లాక్కెళ్లి ఆమెపై లైంగికంగా దాడి చేసేందుకు యత్నించిన ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఓ మహిళ రాత్రి 11 గంటల సమయంలో తన ఏడు సంవత్సరాలు కలిగినటువంటి తన కూతురుతో కలిసి ఒంటరిగా గౌరీశంకర్ కాలనీకి వెళ్లే రోడ్డులో నడుచుకుంటూ వెళుతోంది.

అయితే రాత్రి సమయం కావడంతో ఆ రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంది.ఇదంతా గమనిస్తున్నటువంటి ఇద్దరు యువకులు మోటార్ సైకిల్ వాహనం పై వచ్చి మహిళ కూతుర్ని బలవంతంగా లాక్కొని ఓ యువకుడు వెళ్లగా, మరో వ్యక్తి అక్కడే ఉండి ఆ మహిళను అడ్డగించి ఆమెపై లైంగికంగా దాడి చేయడం మొదలుపెట్టాడు.

"""/"/ దీంతో ఆ మహిళ ప్రతిఘటించి కేకలు వేయడంతో భయపడినటువంటి ఆ వ్యక్తి ఆమెను అక్కడే వదిలి పెట్టి పారిపోయాడు.

అయితే తన కూతురు విషయం తన కుటుంబ సభ్యులకు తెలిపేందుకు ఇంటికి వెళ్లగా తన ఇంట్లో తన కూతురు ఉండడం చూసి ఇదంతా గురించి తెలిసిన వారే చేశారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అంతేగాక ఈ విషయమై దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

క్యా క్యాచ్ హే మాక్స్… అదుర్స్ అంటున్న క్రికెట్ బ్రదర్స్!