రాత్రిళ్ళు భోజనం లేటుగా చేస్తే ఏమవుతుందో తెలుసా

ఈ కాలంలో తొందరగా పడుకోవడం.తొందరగా భోజనం చేయడం అంటే చాలా కష్టం.

టీవీలలో షో లు చూసి రాత్రిళ్ళు భోజనం చేసేసరికి సమయం 10 గంటలు అవుతోంది చాలా మందికి.

దీనివల్ల అజీర్తి సమస్యలు, మలబద్ధకం, నిద్రలేమి, మధుమేహం, ఇలా అనేక రకాల సమస్యల బారినపడుతున్నారు.

అయితే, రాత్రిళ్లు తొందరగా భోజనం చేస్తే అనేక రకాల అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండవచ్చు అంటున్నారు వైద్యులు.

రాత్రిళ్ళు టైం కి తింటూ.సరైన సమయానికి పడుకునే వాళ్ళు చాలా శక్తివంతగా ఉంటారని.

వారి ఆయుష్షు కూడా పెరుగుతుందట.అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం,నిద్ర సరిగాపోకపోవడం చేస్తే లేనిపోని రోగాలన్నీ తెచ్చుకున్నట్టే అంటున్నారు వైద్యులు.

పగటిపూట మనిషిలో జీవక్రియ చాలా వేగంగా ఉంటుందట.అది రాత్రి పూట మాత్రం చాలా నెమ్మదిగా ఉంటుంది.

అందుకే పగటివేళల్లో ఎలా తిన్నా సరే రాత్రి సమయం లో మాత్రం సాయంత్రం ఆరు గంటలకల్లా తినేయాలట.

నైట్ టైం డ్యూటీలు చేసేవాళ్ళు మాత్రం రాత్రి ఎనిమిది లోగా చేస్తేనే మంచిది అని అంటున్నారు.

అంతేకాదు రాత్రిళ్ళు మనం తినే ఆహారం లో మసాల ,బిరియాని,వంటి వాటిని తీసుకోవడం వలన జీవక్రియ జరగక అనేక సమస్యలు వచ్చిపడతాయట.

రాత్రి భోజనం చేయగానే కాస్త అటూ ఇటూ నడిస్తే మంచిది అని చెప్తున్నారు వైద్యులు.

కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్..!!