ఐఫోన్ 15 ఆలస్యంగా డెలివరీ.. స్టోర్ సిబ్బందిని చితకబాదిన కస్టమర్లు..

సెప్టెంబర్ 22న రిలీజ్ అయిన ఐఫోన్లు ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకున్నాయి.అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయిన ఈ ఫోన్లను త్వరగా దక్కించుకోవాలని కొనుగోలుదారులు తెగ ఆరాటపడుతున్నారు.

బారులు తీరిన క్యూలలో నిల్చోని మరీ వెయిట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం ఢిల్లీలో ఐఫోన్ డెలివరీ ఆలస్యమైందని కస్టమర్లు ఎలక్ట్రానిక్స్ స్టోర్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.

కమలా నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఐఫోన్ 15 విక్రయం ఆలస్యం అయిందనే చిన్న కారణంతో కస్టమర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు.

ఈ ఘటన తర్వాత ఢిల్లీ పోలీసులు కస్టమర్లపై కఠిన చర్యలు తీసుకున్నారు. """/" / వారి గొడవకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.

ఆ వీడియో ఓపెన్ చేస్తే మనకు కస్టమర్లు స్టోర్ సిబ్బందిపై పిడిగుద్దుల వర్షం కురిపించడం చూడవచ్చు.

అంతేకాదు, కస్టమర్లలో ఒక వ్యక్తి ఒక ఉద్యోగి షర్టు కూడా చించేసి మరీ కొట్టేశాడు.

వారు రెచ్చిపోవడంతో అక్కడ భీతావాహ వాతావరణ నెలకొన్నది.వీరిని ఆపేందుకు ఇతర ఉద్యోగులు ప్రయత్నించినా వారు ఆగలేదు.

"""/" / ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఈ ఘటనకు సంబంధించిన వీడియో షేర్ చేసింది.

నిన్న షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 10 లక్షలు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇది చూసి నెటిజన్లు "ఐఫోన్ కోసం కొట్టుకోవడం ఏంటయ్యా బాబు" అని వారిని తిట్టుపోస్తున్నారు.

అమెరికన్ మొబైల్స్ కోసం ఇండియన్స్ ఇలా కొట్టుకోవడం సిగ్గుచేటు అని మరికొందరు కామెంట్లు పెట్టారు.

మొత్తం మీద ఈ గొడవ భారతదేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది.ఇకపోతే కస్టమర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఐఫోన్ 15ని రూ.

40 వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

షాకింగ్ వీడియో: వర్క్‌ప్లేస్‌లో ఘోర తప్పిదం.. ఫోర్క్‌లిఫ్ట్ బీభ‌త్సంతో ఏమైందో చూడండి..