నటుడు చిరంజీవి సర్జా భార్య రెండో పెళ్లి అంటూ ప్రచారం.. నిజం ఏంటంటే?

కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా గురించి మనందరికీ తెలిసిందే.కన్నడ ఇండస్ట్రీ లో హీరోగా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలోనే కేవలం 35 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు.

మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే చిరంజీవి సర్జా చనిపోయే నాటికి అతని భార్య వయసు కేవలం 30 ఏళ్లు మాత్రమే.

అంతేకాకుండా చిరంజీవి చనిపోయినప్పటికీ గర్భంతో కూడా ఉంది.గర్భవతిగా ఉన్నప్పుడు కొండంత అండ తో ఉండాల్సిన భర్త కన్నుమూయడంతో ఆమె గుండెలవిసేలా రోదించారు.

ఇక ఆమెకు వచ్చిన కష్టం చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చారు.చిరంజీవి సర్జా 2020, జూన్ 7వ తేదీన మరణించాడు.

ఇతను మరణించిన తరువాత 2021 లో మరొక కన్నడ స్టార్ హీరో అయినా పునీత్ రాజ్ కుమార్ మరణించిన విషయం తెలిసిందే.

ఇక చిరంజీవి చనిపోయే సమయానికి అతని చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి.

ఇక చిరంజీవి ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది.

అంతే కాకుండా అతని మరణాన్ని జీర్ణించుకోలేక పోయారు.ఇది ఇప్పటికీ అతని కుటుంబ సభ్యులు అతని మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక అతను చనిపోయిన నాలుగు నెలల తర్వాత మేఘన కు అబ్బాయి పుట్టాడు.

ఇక మొన్నటివరకు చిన్నపిల్ల వాడిని చిన్న జూనియర్ చిరంజీవి సర్జా అని కూడా పిలిచేవారు.

"""/" / కానీ మేఘన ఇటీవలే వారసుడు పేరు రాయన్ రాజ్ సర్జ అనే నామకరణం చేసి ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఇక తన భర్త చనిపోయిన తర్వాత ఆమె ఇంట్లోనే ఉంటూ కొడుకులోనే తన భర్తను చూసుకుంటోంది.

ఆ బాధ నుంచి బయటకు రావడానికి ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

కెరిర్ పరంగా వరుసగా సినిమాలు చేస్తే కానీ ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రాలేదు అని ఫిక్స్ అయిపోయింది మేఘన.

ఈ నేపథ్యంలోనే మేఘనారాజ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. """/" / అందులో ఒకటి సెల్ఫీ మమ్మీ.

గూగుల్ డాడీ కాగా, మరొకటి బుద్ధిమంత 2.ఇక ఈమె నటించిన రెండు సినిమాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈమె రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి.

అయితే ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ సీరియస్ అయింది మేఘనారాజ్.

అంతేకాకుండా కన్నడ బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్తో కలసి ఆమె ఏడు అడుగులు వేయబోతున్న ప్రచారాలు కూడా జరిగాయి.

కానీ మేఘనారాజ్ మాత్రం ఆ వార్తలో ఎటువంటి నిజం లేదు అంటూ కొట్టిపారేసింది.

భారత సంతతి అధికారిపై డొనాల్డ్ ట్రంప్ వేటు