విక్రమ్ జాడే కనిపెట్టలేదా?
TeluguStop.com
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలం అయ్యింది.శాస్త్రవేత్తలు ఎంతో ప్రయత్నించినా కూడా ల్యాండర్ విక్రమ్‌ను సేఫ్‌గా చంద్రుడిపై దించడంలో సఫలం కాలేక పోయారు.
విక్రమ్ చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ అయ్యిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.ఇది జరిగిన రెండు రోజుల్లోనే విక్రమ్‌ను కనిపెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.
చంద్రుడిపై విక్రమ్ ఒక వైపుకు ఒంగి ఉందని గుర్తించినట్లుగా శాస్త్రవేత్తలు ప్రకటించారు.అయితే మళ్లీ ఇప్పుడు విక్రమ్ ల్యాండ్ ఆధారాలే కనిపించడం లేవు అంటూ చెప్పుకొచ్చారు.
అమెరికాకు చెందిన నాసా ప్రయోగించిన ఆర్బిటాల్ చంద్రుడికి అతి దగ్గర నుండి చూసినా కూడా విక్రమ్ ల్యాండర్ ఎక్కడ కనిపించడం లేదట.
ఈ విషయం స్వయంగా ఇస్రో ప్రకటించింది.అంటే ఇన్ని రోజులు విక్రమ్ కనిపించింది.
ఒక వైపుకు ఒంగి ఉంది, సింగిల్ పీస్‌గానే ఉంది అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేలిపోయింది.
ఇస్రో శాస్త్ర వేత్తలు ఇంకా కూడా ఈ ప్రయోగంను నిర్వహిస్తున్నారు.మరో రెండు రోజుల్లో ల్యాండర్ విక్రమ్ ఎక్స్‌ఫైర్ అవ్వబోతుంది.
దాంతో మొత్తంకే ప్రయోగాన్ని నిలిపేస్తారు.
విడాకులు తీసుకుంటే అలా జడ్జ్ చేస్తారా….ఫైర్ అయిన సమంత?