ఘనంగా శ్రావణ మాసం చివరి శనివారం.. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా : శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.

నేడు శ్రావణ చివరి శనివారం సందర్భంగా వివిధ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలలో , శ్రీ రుక్మిణి సత్య భామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో, శ్రీ మార్కండేయ మందిరములో, రాచర్ల గొల్లపల్లి , బొప్పాపూర్ అక్కపల్లి, వివిధ గ్రామాల్లోని వివిధ ఆలయాలలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నారాయణపూర్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు గోపాల చారి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.నారాయణపూర్ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ నిమ్మ లక్ష్మీనారాయణ రెడ్డి మల్లారెడ్డి , మాజీ ఉపసర్పంచ్ సిరిపురం మహేందర్ , ఆలయ కమిటీ అధ్యక్షులు , నరసయ్య , హనుమాన్లు , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి నాయకులు బండారి బాల్ రెడ్డి , గుండాడి రాం రెడ్డి, మెండే శ్రీనివాస్ యాదవ్ చెన్ని బాబు , కిషన్ రెడ్డి , రాజిరెడ్డి, పరశురాములు , తదితరులు పాల్గొని శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు , ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదములు పులిహోర సిరా భక్తులకు వితరణ చేశారు,.

130 ఏళ్ల కెమెరాతో రగ్బీ మ్యాచ్ క్యాప్చర్‌.. అందులో ఏం కనిపించిందో చూసి..?