రేపటితో ముగుస్తున్న తెలంగాణ సీపీగెట్‌ దరఖాస్తుకు తుది గడువు..

హైదరాబాద్:జూన్ 16 తెలంగాణ రాష్ట్రంగా ఉన్న యూనివర్సిటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తోపాటు ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న సీపీగెట్‌( Telangana CPGET )కు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు రేపే చివరి గడువు.

జూన్‌ 17 సోమవారం తో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియనుందని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

సీపీగెట్‌కు ఇప్పటివరకు 52 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండానే రేపు గడువు సమయం ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

కాగా తెలంగాణ సీపీగెట్‌ 2024 పరీక్ష జులై 5న జరగనున్నాయి.

హౌస్ నుంచి బయటకు వచ్చేసిన టేస్టీ తేజ… బిగ్ బాస్ 8 రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?