ల్యాప్‌టాప్, టాబ్లెట్ ధరలు అమాంతం పెరుగుదల.. దాంతో ఏం చేయబోతున్నాయంటే..?!
TeluguStop.com
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మరో షాక్ ఇవ్వనుంది.ఇప్పటికే ఎలక్ట్రానిక్ వస్తువుల రేట్లు( Electronic Devices ) పెరగ్గా.
త్వరలో మరింత పెరిగే అవకాశాలున్నాయి.ముఖ్యంగా ల్యాప్‌టాప్, టాబ్లెట్ ధరలు ఆకాశాన్నంటనున్నాయి.
ల్యాప్‌టాప్, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలకు ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
దీంతో వాటి ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది. """/" /
మేడ్ ఇన్ ఇండియా( Made In India )లో భాగంగా దేశీయ తయారీ కంపెనీలు, దేశీయ ఉత్పత్తులను కేంద్రం ప్రోత్సహించింది.
దీని వల్ల దేశం అభివృద్ధి చెందడంతో పాటు సేల్స్ పెరగడం వల్ల ఇక్కడి కంపెనీలకు లాభం జరుగుతుంది.
దీని వల్ల కేంద్ర ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ ల రూపంలో నిధులు వస్తాయి.
దీంతో విదేశాల నుంచి ఎగుమతి చేసుకునే పర్సనల్ కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లపై నిషేధం( Ban On Import Of Electronic Devices ) అమల్లోకి తెచ్చింది.
దీని వల్ల ఆపిల్, శాంసంగ్, హెచ్ పీ వంటి సంస్థల నుంచి భారత్ లోకి ల్యాప్‌టాప్ ల దిగుమతులు ఆగిపోతాయి.
"""/" /
కేంద్ర ప్రభుత్వం( Central Government ) దిగుమతులపై నిషేధం విధించడంతో దేశంలోని టెక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వ్యాపారంలో ఒడిదొదుకులు నెలకొంటాయని ఆందోళన చెందుతోంది.అలాగే స్కూళ్లు, కాలేజీలు కూడా మొదలుకావడంతో చాలామంది ల్యాప్ టాప్( Laptop ), కంప్యూటర్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాటి ధరలు భారీగా పెరగనున్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
ఎక్కువ రేటుకు ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లను కొనుగోలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.అయితే మేడ్ ఇన్ ఇండియా స్కీమ్‌లో భాగంగా రూ.
17 వేల కోట్ల ఇన్సెంటివ్‌లను టెక్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ పాలసీని గతంలోనే తీసుకురాగా.
టెక్ కంపెనీల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది.వీటికి దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే సూచించింది.
సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్.. అతడి వేలిముద్రలు ఎక్కడా దొరకలేదా?