అయోధ్య రామ్‌లల్లాపై పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన లావోస్.. !!

ఏళ్ల తరబడి నిరీక్షణ, వివాదాలు, న్యాయ పోరాటాలు అన్నింటిని అధిగమించి శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) చేతుల మీదుగా శ్రీరామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్టా కార్యక్రమం ( Ram Lalla Pran Pratishta Program )ఘనంగా జరిగింది.

నాటి నుంచి రామయ్య దర్శనానికి దేశ, విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.ఇప్పటికే కొన్ని లక్షల మంది భక్తులు రాములోరిని దర్శించుకున్నారని అంచనా.

ప్రపంచంలోని చాలా దేశాల వాసులు శ్రీరామచంద్రుడిపై భక్తిని చాటుకుంటున్నాయి.తాజాగా ఆగ్నేయాసియా దేశమైన లావోస్( Laos ).

శ్రీరాముడిపై స్టాంప్‌తో కూడిన ప్రత్యేక స్టాంప్ సెట్‌ను విడుదల చేసింది.ఇది అయోధ్యలోని రామ్‌లల్లాకు సంబంధించి విడుదలైన ప్రపంచంలోనే మొట్టమొదటి స్టాంప్.

భారతదేశంతో ఉన్న లోతైన నాగరికత సంబంధాన్ని ప్రదర్శిస్తూ లావోస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంపులో ఇది భాగం.

శనివారం లావోస్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్,( Minister Jaishankar ) ఆ దేశ విదేశాంగ మంత్రి సాలెమ్‌క్సే కొమ్మాసిత్( Minister Salemxe Kommasit ) సంయుక్తంగా దీనిని ఆవిష్కరించారు.

"""/" / సదరు స్టాంప్ సెట్‌లో రెండు స్టాంపులు ఉన్నాయి.రెండవ స్టాంప్ లావోస్ పురాతన రాజధాని లుయాంగ్ ప్రాబాంగ్ నగరానికి చెందిన బుద్ధ భగవానుని చిత్రీకరించారు.

బౌద్ధమతం కారణంగా వేల ఏళ్లుగా భారత్ - లావోస్ మధ్య అనుబంధం ఉంది.

రామాయణాన్ని లావోస్‌లో రామకియన్ లేదా స్టోరీ ఆఫ్ ఫ్రా లక్ ఫ్రా రామ్‌గా అభివర్ణిస్తారు.

"""/" / 2024కి ఆసియాన్ చైర్‌గా లావో పీడీఆర్.వియంటైన్‌లో నిర్వహిస్తున్న ఆసియాన్ , ఇండియా పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ (పీఎంసీ), ఈఏఎస్ విదేశాంగ మంత్రుల సమావేశం, ఆసియాన్ రీజినల్ ఫోరమ్ (ఏఆర్ఎఫ్) నిమిత్తం జైశంకర్‌ వియంటైన్‌లో పర్యటిస్తున్నారు.

లావోస్ నుంచి నేరుగా జపాన్‌లో జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి జైశంకర్ వెళ్లనున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 2, సోమవారం 2024