నూజివీడు వేదికగా పేదలకు భూ పంపిణీ కార్యక్రమం
TeluguStop.com

ఏపీలో భూ పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.ఈ మేరకు ఏలూరు జిల్లాలోని నూజివీడులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.


రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.2003 నాటి అసైన్డ్ భూములకు హక్కు కల్పిస్తున్నామన్నారు.


కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదన్నారు.
మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని పేర్కొన్నారు.రెండో దశలో 24.
6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని సీఎం జగన్ వెల్లడించారు.ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20,24,709 మంది పేద రైతులకు లబ్ధి చేకూరిందని తెలిపారు.
ఈ క్రమంలోనే మొత్తం 35,44,866 ఎకరాల భూ పంపిణీ జరిగింది.
నాగార్జున అసలు పేరు అది కాదా…. అసలు పేరు ఏంటో తెలుసా… ఇన్నాళ్లు తెలియనే లేదే?