ఏలూరు జిల్లా స్వర్ణవారిగూడెంలో భూ వివాదం..!
TeluguStop.com
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో భూవివాదం నెలకొంది.పోలవరం నిర్వాసితులకు, స్థానిక గిరిజనులకు మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
పోలవరం నిర్వాసితులు తమ భూములను ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వం 1/70 చట్టంలో భాగంగా తమకు భూములు ఇచ్చిందని నిర్వాసితులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కిన గిరిజనులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
లేని పక్షంలో తమకు చావు శరణ్యమని వాపోతున్నారు.దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
రియల్ లైఫ్ లో నాన్నకు ముఫాసాతో పోలికలు.. సితార ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!