తెలుగు, తమిళ భాషల్లో జూన్ 24న గ్యాంగ్‌స్టర్ గంగరాజు గ్రాండ్ రిలీజ్

తెలుగు, తమిళ భాషల్లో జూన్ 24న గ్యాంగ్‌స్టర్ గంగరాజు గ్రాండ్ రిలీజ్

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వైవిద్యభరితమైన కథలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు హీరో లక్ష్.

తెలుగు, తమిళ భాషల్లో జూన్ 24న గ్యాంగ్‌స్టర్ గంగరాజు గ్రాండ్ రిలీజ్

విలక్షణ కథలకు కమర్షియల్ టచ్ యాడ్ చేస్తూ రాసిన కథల్లో ఎనర్జిటిక్ పర్‌ఫార్‌మెన్స్‌తో దూసుకుపోతున్నాడు.

తెలుగు, తమిళ భాషల్లో జూన్ 24న గ్యాంగ్‌స్టర్ గంగరాజు గ్రాండ్ రిలీజ్

'వలయం' సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.ప్రస్తుతం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో బిజీగా ఉన్నారు.

'చదలవాడ బ్రదర్స్' సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.

సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు.ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని ట్రెమిండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

లిరికల్ సాంగ్స్ ఆడియన్స్‌కి కొత్త టేస్ట్ చూపించాయి.ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేయడంతో సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది.

ఈ క్రమంలోనే అవుట్ పుట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా, బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా సర్వ హంగులతో గ్రాండ్‌గా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుతున్నారు మేకర్స్.

ఈ వర్క్స్ చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో చిత్ర రిలీజ్ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు.

జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చాలా ఘనంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

దీంతో పాటు ధీర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు హీరో లక్ష్.

గతంలో ఎన్నడూచూడని ఆసక్తికర కథతో గ్యాంగ్ స్టర్ గంగరాజు మూవీ రూపొందిస్తున్నామని, ప్రేక్షకులు థ్రిల్ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని, అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

ఈ చిత్రానికి సాయి కార్తీక్ బాణీలు కట్టగా.వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

నెలకి రూ.1.5 లక్షల జీతం.. అయినా రూ.62 లక్షల అప్పుల ఊబిలో.. స్టాక్ మార్కెట్ దెబ్బ ఇది!!

నెలకి రూ.1.5 లక్షల జీతం.. అయినా రూ.62 లక్షల అప్పుల ఊబిలో.. స్టాక్ మార్కెట్ దెబ్బ ఇది!!