ఎన్నికలవేళ పవన్ కళ్యాణ్ పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
వైసీపీ నాయకురాలు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ( Lakshmi Parvathi )మంగళవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కపటం లేని మంచి మనిషి అని.అలాంటి వ్యక్తి చంద్రబాబును నమ్మి మోసపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
అబద్ధాలు ఆడటంలో చంద్రబాబుకి మించిన వారు ఎవరూ లేరని కామెంట్లు చేశారు.సొంత మామనే వెన్నుపోటు పొడిచిన ఘటన చంద్రబాబుకే దక్కిందన్నారు.
పిఠాపురంలో కాపులంతా ఐక్యం కావాలని, భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతా( Vanga Geetha )ను అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు.
"""/" /
పవన్ పిఠాపురానికి వలస వచ్చాడని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలు వంగా గీతకే ఓటు వేయాలంటే అభ్యర్థించారు.
2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
పవన్ ఓడిపోవడం అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది.దీంతో ఈసారి ఎలాగైనా పిఠాపురం నుండి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
దీంతో 2024 ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో పిఠాపురంలో అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు.
పిఠాపురం నుండి వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేస్తున్నారు.ఆమె గతంలో ఇదే నియోజకవర్గము నుండి గెలవడం జరిగింది.
దీంతో ఈసారి పిఠాపురంలో గట్టి పోటి నెలకొంది.
ఈ న్యాచురల్ క్రీమ్ తో వైట్ అండ్ స్మూత్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?