NTR వారసులు రాజాకీయాల్లోకి వస్తే ఆదరించండి… లక్ష్మీ పార్వతి

నెల్లూరు లోని R&B గెస్ట్ హౌస్ లో రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్ పర్సన్, వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి మీడియా సమావేశం నిర్వహించారు.

లక్ష్మీ పార్వతి ( Lakshmi Parvath )కామెంట్స్.దివంగత మాజీ ముఖ్యమంత్రి NT రామారావు పరిపాలన అద్భుతం గా సాగింది.

ముఖ్యం గా పేదల కోసం ఆనాడు ఎన్నో పధకాలను ప్రవేశ పెట్టి పేద ప్రజల్లో దేవుడిలా మారారు.

తర్వాత నారా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అధికారం లోకి వచ్చాకా ఎటువంటి అభివృద్ధి జరగ లేదు.

అన్ని అబద్దాలు చెప్పి పాలన ముగించారు.తర్వాత దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి కూడా ఎంతో అద్భుత పాలన చేసి ప్రజలకు ఎంతో చేరువయ్యారు.

ఇప్పుడు పరిపాలన చేస్తున్న YS జగన్మోహన్ రెడ్డి తన మ్యానిఫెస్టో లో చెప్పిన అన్ని పధకాలను 99.

5 శాతం పైగా పూర్తి చేశారు.గత ప్రభుత్వాలు తమ పాలన లో 5 శాతం కూడా తమ మ్యానిఫెస్టో పూర్తి చేయలేదు.

పోలవరం పనుల్లో తీవ్ర అవినీతి చేసింది చంద్రబాబు నాయుడు.పెన్నా ఆనకట్ట పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది.

Ys జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా వుందినా రాజకీయ చరిత్రలో ప్రజలు ను ఇంత గొప్పగా చూసుకున్న ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి 600 పైన హామీలు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏవి నెరవేర్చెలేదు.

గత ప్రభుత్వం లో చేసిన పనులు కు టీడీపీ ఎక్కడా లెక్కలు చూపలేదు.

వైసీపీ ప్రభుత్వం ఇసుక దోపిడీ చేసిందని అసత్య ప్రచారాలు చేస్తున్నయి.టిడిపి గతం లో లక్షలు కోట్లు దోచుకున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ IT రంగం పరుగులు పెడుతుంది.విద్య వైద్య రంగం లో వైసీపీ ప్రభుత్వం ఎంతో అద్భుతం గా పనిచేస్తుంది.

చంద్రబాబు నాయుడు తన తనయుడు ని కూడా సరైన మార్గం లో పెంచలేదు.

60 కోట్లు ఇచ్చి సర్టిఫికెట్ లు కొని ఇతర దేశాల్లో చదువు కొన్నాడని అందరికి చెబుతున్నారు.

పుత్రుడు, దత్త పుత్రుడు ఇద్దరూ హాంతకుల్లా మాట్లాడుతూ వున్నారు.నాయకులు ఎవరూ ఇలా మాట్లాడరు.

చదవడం, రాయటం రాని లోకేష్ పాదయాత్ర చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ని, ఎమ్మెల్యేలు ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు.

అమాయకుడైనపవన్ కల్యాణ్ ( Pawan Kalyan )అంటే నాకు సానుభూతి.చంద్రబాబు నాయుడు పవన్ను వాడుకుంటున్నాడు.

టిడిపి వారసులు ఎంతో సమర్ధలు అయిన హరికృష్ణ కొడుకులు జూనియర్ ఎన్టీఆర్ లను పార్టీ కి దూరం గా పెట్టి చంద్ర బాబు ఎంతో మోసం చేస్తున్నారు.

NTR వారసులు రాజాకీయాల్లోకి వస్తే ఆదరించండి.

అలాంటి వాళ్లకు మాత్రమే పవన్ గుండెల్లో స్థానం.. ఎస్జే సూర్య క్రేజీ కామెంట్స్ వైరల్!