పెళ్లి చేసుకోకపోయినా అవి పొందొచ్చు..సంచలంగా మారిన హీరోయిన్ వ్యాఖ్యలు.! అసలేమైంది?
TeluguStop.com
15 ఏళ్లకే నటిగా పరిచయం అయింది.కుంకీ సినిమాతో ఈ కేరాళా కుట్టి కోలీవుడ్ ని ఆకట్టుకుంది.
ఆ తర్వత కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి బాగా ఫాలోయింగ్ సంపాధించుకుంది.
ఇలా కెరీర్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే నటనకు గ్యాప్ ఇచ్చి చదువు కోసం విదేశాలకు జంప్ అయింది.
చదువు కంప్లీట్ చేసి తిరిగి సినిమాల్లో అడుగుపెట్టింది.కానీ ఈ సారి లక్కు కలిసిరాలేదు.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభుదేవా తో యంగ్ మంగ్ ఛంగ్ అనే సినిమాలో నటిస్తుంది.
ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.? సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తున్న కోలీవుడ్ చిన్నది లక్ష్మీమీనన్ Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే కొన్ని రోజుల నుంచి లక్ష్మీ మీనన్ పెళ్లిపై రకరకల వార్తలు వినిపించాయి.
ఈ పెళ్లి వార్తలపై తాజగా లక్ష్మీమీనన్ స్పందించింది."నాకు వివాహబంధంపై నమ్మకం లేదు.
పెళ్లి చేసుకుంటేనే ప్రేమ, అభిమానం లభిస్తాయని నేను అనుకోను.పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు.
నేను చెప్పేది ఇతరులకు అర్థం అవుతుందో, కాదో తెలియదు.నేను మాత్రం తెలివిగానే చెబుతున్నాను.
వివాహ జీవితంపై నాకు నమ్మకం లేదు.అందుకే నేను పెళ్లే చేసుకోను.
అలాగని నాకు జీవితానికి అండ ఉండరని చెప్పడం లేదు.కచ్చితంగా ఉంటాడు.
అందుకు అండ అనే మాటకు బలం, చాలా నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగించే వ్యక్తి కావాలి.
దాన్ని పెళ్లి అనే మాటల్లో చేర్చడం నాకు ఇష్టం లేదు.అయితే దాన్ని సహజీవనం అని కూడా చెప్పను.
మరో విషయం ఏమిటంటే జీవితంలో అనుభవమే ఉత్తమ ఉపాధ్యాయుడు.అయితే నేను పెళ్లి గురించి చెప్పిన విషయాలు అనుభవాలే కారణం అని చెప్పను.
దాన్ని ఎలా చెప్పాలో నిజానికి నాకే తెలియదు.".
డాకు మహారాజ్ మూవీకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. నిర్మాత నాగవంశీ క్రేజీ కామెంట్స్ వైరల్!