మోహన్ లాల్ 'మాన్స్టర్'లో మంచు లక్ష్మి.. క్లారిటీ ఇచ్చేసిందిగా!
TeluguStop.com
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ మధ్యనే 'మాన్స్టర్' సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా తన స్పీడ్ ను కొనసాగిస్తున్నాడు.
అంతేకాదు వరుస సినిమాలు చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు.ఈ సినిమాను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ చూస్తేనే తెలిసి పోతుంది.
చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో ఆయన సీరియస్ గా గన్స్ ముందు కూర్చుని ఉన్నాడు.
అందుకే ఈ సినిమా సీరియస్ యాక్షన్ డ్రామా అని అభిమానులంతా భావిస్తున్నారు.ఇక మాన్స్టర్ సినిమాలో మోహన్ లాల్ 'లక్కీ సింగ్' పాత్రలో కనిపించ నున్నాడు.
మోహన్ లాల్ ఆయన వయసుకు తగ్గ పాత్రలను చేస్తూ విభిన్నంగా తన సినిమాలను ఎంచుకుంటూ ఉంటాడు.
ఇక ఈ సినిమా కూడా కొత్తగా విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. """/"/ ఇక ఈ సినిమాలో మంచు లక్ష్మి నటిస్తుందని.
మోహన్ లాల్ భార్య పాత్రలో కనిపించ బోతుందని.గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ విషయంపై తాజాగా మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు.
ఆమె ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలిపింది. """/"/
మోహన్ లాల్ మాన్స్టర్ పోస్టర్ ను షేర్ చేస్తూ ఈ విషయాన్నీ తెలిపింది.
కొత్త భాష.కొత్త జోనర్ లో సినిమా చేయబోతున్నాను.
అందుకే చాలా ఎగ్జైట్ గా ఉన్నాను.నా ఫస్ట్ మలయాళ సినిమా అత్యంత ఇష్టమైన మోహన్ లాల్ తో కలిసి చేయబోతున్నందుకు మరింత ఆనందంగా ఉందని మంచు లక్ష్మి తెలిపారు.
అంతేకాదు ఈ సినిమాతో మీ ముందుకు వచ్చేందుకు ఎంతో ఇంట్రెస్ట్ గా ఉన్నానంటూ తెలిపింది.
మజాకా మూవీ రివ్యూ అండ్ రేటింగ్!