కరోనాలు.. గిరోనాలు మమ్మల్ని ఆపలేవు: మలేషియా తైపుసం వేడుకల్లో వేలాది భారతీయులు

సాంప్రదాయాల విషయంలో భారతీయ హిందువులు ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయరు.కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.

దీని బారినపడి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, లెక్కకు మించి ఆసుపత్రిల్లోని ఐసోలేటేడ్ వార్డుల్లో ఉన్నారు.

కరోనా చేతుల్లో పడకుండా వుండేందుకు గాను మాస్క్‌లు ధరించడంతో పాటు నలుగురు కలిసి వున్న చోటకి వెళ్లడానికే భయపడిపోతున్నారు.

అయినా ఇలాంటి వాటిని లెక్క చేయకుండా మలేషియాలోని వార్షిక తైపుసం పండుగను జరుపుకునేందుకు పలు దేవాలయాలలో హిందువులు గుమిగూడారు.

ఇందుకోసం వారి శరీరాలను హుక్స్, స్కేవర్లతో కవర్ చేశారు.రాజధాని కౌలాలంపూర్ శివార్లలోని బటు కేవ్స్ ఆలయానికి భారీగా జనం తరలివచ్చి, మురుగన్‌కు పూజలు చేశారు.

ఆలయానికి చేరుకోవడానికి 272 మెట్ల వరకు చెప్పులు లేకుండా నడిచారు.స్వామివారికి సమర్పించడానికి బహుమతులు, పాలకుండలను తీసుకుని వెళ్లారు.

కవాడిస్ అని పిలవబడే భారీగా అలంకరించి లోహంతో తయారు చేసిన వస్తువులను మోసుకెళ్లేందుకు పలువురు భక్తులు ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

కొందరు 100 కేజీల బరువున్న కవాడీలను తీసుకువెళుతూ.పూనకంలో ఊగుతూ కనిపించారు.

మరికొందరు త్రిశూలాలను వారి ముఖాలకు గుచ్చుకున్నారు. """/"/ కాగా మలేషియాలో ఇప్పటి వరకు 16 మందికి కరోనా వైరస్ సోకింది.

దీనిపై నవీంద్రన్ ఆర్ముగం అనే భక్తుడు స్పందిస్తూ.వుహాన్ వైరస్ నుంచి తాము ఎంతో ఆందోళన చెందుతున్నామని తెలిపాడు.

మరోవైపు తైపుసానికి ముందు భక్తులు ప్రతిరోజు ప్రార్ధనా సమావేశాలను నిర్వహిస్తారు.ఈ రోజులలో శృంగారానికి దూరంగా ఉంటూ, కొన్ని వారాలపాటు కఠినమైన శాఖాహారాన్ని తీసుకుంటారు.

మలేషియాలో సుమారు 32 మిలియన్ల మంది ప్రజలు ముస్లింలు.అదే సమయంలో దేశంలో రెండు మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు.

మురుగన్ ప్రధానంగా దక్షిణ భారతదేశంలో, ఆగ్నేయాసియాలోని తమిళ సమాజంతో పూజలు అందుకుంటున్నాడు.

మందు బాబులకు బంపర్ ఆఫర్.. మద్యం బాటిల్‌కి గుడ్డు, గ్లాస్, వాటర్ ప్యాకెట్ ఫ్రీ..