ఐదుసార్లు ఫెయిల్.. ఆరో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్.. లఖన్ సింగ్ సక్సెస్ కు మెచ్చుకోవాల్సిందే!

సాధారణంగా సివిల్స్ లో ఫెయిల్ అయితే మళ్లీ ప్రయత్నం చేయాలంటే ఎంతో సమయం ఎదురుచూడాల్సి ఉంటుంది.

కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం వస్తుందని చెప్పలేదు.అయితే ఒక వ్యక్తి మాత్రం ఐదుసార్లు ఫెయిల్ అయినా ఆరోసారి ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకున్నారు.

ఆరో ప్రయత్నంలో సివిల్స్ పరీక్షలో లఖన్ సింగ్( Lakhan Singh ) 756వ ర్యాంక్ సాధించడం గమనార్హం.

"""/" / మనిషికి పట్టుదల ఉంటే లక్ష్యాన్ని సాధించడం కష్టం అయితే కాదని లఖన్ సింగ్ సక్సెస్ స్టోరీ( Success Story )తో ప్రూవ్ అవుతోంది.

ఆరో ప్రయత్నంలో లక్ష్యం సాధించిన తర్వాత లఖన్ సింగ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ర్యాంక్ సాధించినందుకు ఆనందంగా ఉందని ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని ఆయన అన్నారు.

2017 సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత లక్ష్యం దిశగా అడుగులు వేశానని ఆయన తెలిపారు.

"""/" / నేను ఈ స్థాయికి చేరుకోవడం కోసం ఎన్నో కష్టాలను అనుభవించానని లఖన్ సింగ్ అన్నారు.

సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని నేను సివిల్స్ కు ( UPSC Civils )ప్రిపేర్ అయ్యానని లఖన్ సింగ్ వెల్లడించారు.

పర్సనాలిటీ టెస్ట్ కోసం మాక్ ఇంటర్వ్యూలను ఎక్కువగా చూశానని ఆయన అన్నారు.లఖన్ సింగ్ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎక్కి లఖన్ సింగ్ ఈ స్థాయికి చేరుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

లఖన్ సింగ్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.ఓటమి విజయానికి తొలిమెట్టు అని లఖన్ సింగ్ సక్సెస్ స్టోరీతో మరోమారు ప్రూవ్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

లఖన్ సింగ్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

లఖన్ సింగ్ ర్యాంక్ కు మంచి ఉద్యోగమే వస్తుందని నెటిజన్లు చెబుతున్నారు.

11 వేల జనాభా ఉన్న దేశంలో మొదటిసారి ఏటీఎం.. ఎలా సాధ్యమైందో తెలుసా?