ఖరీదైన బైక్ లు కొనుగోలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ లు
TeluguStop.com
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన బ్యూటీలు మంచి అవకాశాలతో దూసుకుపోతున్నారు.
టీవీతో పాటు వెండి తెరపై కూడా సందడి చేస్తున్నారు.వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ కు వెళ్లొచ్చిన తర్వాత పలువురు ముద్దుగుమ్మలు డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నారు.
ఇల్లు, కారు కొనుగోలు చేస్తున్నారు.తాజాగా పలువురు బిగ్ బాస్ భామలు తమకు ఇష్టమైన బైకులు కొనుగోలు చేస్తున్నారు.
ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మలు తమ ఫేవరెట్ బైకులు తీసుకోగా.తాజా గా ఈ లిస్టులో మరో భామ చేరింది.
తాజాగా బిగ్ బాస్ ముద్దుగుమ్మ లహరి షారి ఖరీదైన బైక్ కొనుగోలు చేసింది.
BMW బైక్ ను తన గ్యారేజీలోకి తెచ్చుకుంది.ఈ బైక్ ను అందుకుంటున్న ఫోటోలను తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.ఈమె కంటే ముందు మరో బిగ్ బాస్ బ్యూటీ కూడా బైక్ కొనుగోలు చేసింది.
ఆమె మరెవరో కాదు శ్వేతా వర్మ.ఈ ముద్దుగుమ్మ కూడా రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును కొనుగోలు చేసింది.
శ్వేతా వర్మ ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది.అయితే బిగ్ బాస్ షోకు వెళ్లి వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయ్యింది.
ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.ఈ బ్యూటీకి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం.
అందుకే తను రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను కొనుగోలు చేసింది.ఈ బైక్ కు సంబంధించిన ఫోటోలు కూడా ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియాలో పెట్టింది.
"""/"/
అంతేకాదు.తన బైక్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ యుగన్ నిర్వాణను మీకు పరిచయం చేస్తున్నాను.
ఈ బైక్ ను రైడ్ చేసే సమయం వచ్చింది అంటూ కొటేషన్ పెట్టింది.
దీంతో శ్వేత వర్మకు అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు.సేఫ్ గా రైడ్ చేయాలని సూచించారు.
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ…