లగడపాటి - కేటీఆర్ లొల్లి: రేవంత్ ట్విట్

తన సర్వే రిపోర్ట్స్ బయటపెట్టి లగడపాటి రాజగోపాల్ తెలంగాణాలో సంచలనం రేపడమే కాకుండా పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దానికి కారణం అయ్యాడు.

ఇక ఈ విషయంలో అయితే.టీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు కూడా చేసింది.

హరీష్ రావు కేసీఆర్ లాంటి నాయకులు ఈ సర్వేను బోగస్ సర్వేగా తేల్చేశారు కూడా.

కానీ తన మీద జరుగుతున్న ఈ ముప్పేట దాడిలో లగడపాటి కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చాడు.

కేటీఆర్ తన మీద చేసిన వ్యాఖ్యలపై లగడపాటి రిప్లై మరో సంచలనం రేపింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అసలు అందరికంటే.ముందుగా తెలంగాణ లో సర్వే చేయమని చెప్పింది.

నియోజకవర్గాల వివరాలు ఇచ్చింది కూడా మంత్రి కేటీఆరేనని లగడపాటి సంచలన ప్రకటన చేశారు.

అందుకు సంబంధించి తనకు, కేటీఆర్ కు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ను బయటపెట్టారు.

ఈ ఛాటింగ్ పై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు.

తెలంగాణ ఏర్పాటుకు అడుగడుగున అడ్డుపడ్డ లగడపాటితో కేటీఆర్ ఇన్నాళ్లు రహస్య స్నేహాన్ని నడిపినట్లు ఈ ఛాటింగ్ ను చూస్తే అర్థమవుతోందని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోడానికి శత విధాల ప్రయత్నించి చివరకు తన రాజకీయ జీవితాన్ని కూడా వదులుకున్న వ్యక్తితో కేటీఆర్ స్నేహం చేయడం దుర్మార్గమని రేవంత్ తన ట్వీట్ ద్వారా తేల్చి చెప్పారు.

వలసదారుల సంక్షోభం .. ఫ్లైటెక్కిన తొలి శరణార్ధి, బ్రిటన్‌ రువాండా ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా .. ?