రహస్యంగా మైనర్ ను పెళ్లిచేసుకున్న లేడీ టీచర్.. ఎందుకంటే..?!
TeluguStop.com
చదువుకుంది.ఉద్యోగం చేస్తుంది.
తన తెలివితేటలతో కొంత మంది పిల్లలకు ట్యూషన్స్ చెప్పేది.అయితే విద్యాబుద్దులు నేర్పాల్సిన ఆ టీచరే.
తన స్టూడెంట్ పై కన్నేసింది.ఎవరికి తెలియకుండా.
తన ఇంట్లోనే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది.విషయం బయటకు రావడంతో.
కటాకటాల వెనక్కు వెళ్లింది.ఈ ఘటన పంజాబ్ లోని జలందర్ లో జరిగింది.
బస్తీ బావా ఖేల్ ప్రాంతంలో నివాసముంటున్న యువతి అక్కడి కొంతమంది పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ ఉండేది.
గత కొంతకాలంగా ఆ యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.అయితే ఎంతకీ వివాహం కుదరకపోవడంతో ఆందోళన చెందిన యువతి తల్లిదండ్రులు పూజారిని సంప్రదించారు.
అయితే ఆ యువతి జాతకాన్ని పరిశీలించిన పూజారి.ఆమెకు మాంగళ్య దోషం ఉందని చెప్పాడు.
ఆ దోష నివారణకు ఆమెకు మైనర్ బాలుడితో ముందుగా పెళ్లి చేయాలని సూచించాడు.
దీంతో మైనర్ బాలుడి కోసం వెతుకున్న సమయంలోనే.తన దగ్గరకు వచ్చే ఓ 13 ఏళ్ల బాలుడిపై ఆ ట్యూషన్ టీచర్ కన్నుపడింది.
తన దోషం పోవడానికి ఆ బాలుడిని పెళ్లిచేసుకోవాలనుకుంది.వెంటనే తన బుర్రలోకి ఓ ఆలోచన తట్టింది.
అంతే ఆలస్యం చేయకుండా.ఆ ప్రణాళికను అమలు చేసింది.
ట్యూషన్ క్లాసుల కోసం బాలుడు తన దగ్గరే వారం పాటు ఉండాలని విద్యార్థి తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి ఒప్పించింది.
7 రోజులపాటు ఆ బాలుడిని టీచర్ తన ఇంట్లో పెట్టుకుని పెళ్లి వేడుకలు నిర్వహించింది.
అనంతరం తన గాజులు పగలగొట్టి తనకు తాను వితంతువుగా మారిపోయి బాలుడిని ఇంటికి పంపేసింది.
వారం తర్వాత ఇంటికి వచ్చిన ఆ బాలుడు జరిగిన విషయాలు తన తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు షాక్ అయ్యారు.
వెంటనే బస్తీ బావా ఖేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.తన కొడుకుని నిర్భందించి బలవంతంగా హల్దీ వేడుక, మొదటి రాత్రి వంటి ఆచారాలను నిర్వహించారని ఫిర్యాదులో తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.
యువతి కుటుంబ సభ్యుల ఒత్తిడితో బాధితుడి కుటుంబం కేసు వెనక్కు తీసుకున్నారు.అప్పటికే ఈ విషయం సీనియర్ పోలీసులకు చేరింది.
దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని డీఎస్పీ ఆదేశించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై20, శనివారం2024