సాయి పల్లవి సినీ కెరీర్ ఖతం.. ఆమె వద్దనుకున్న సినిమాలకు గుడ్ బై
TeluguStop.com
ఫిదా సినిమా( Fida Movie ) తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాయి పల్లవి( Sai Pallavi ) ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది.
ఆమె చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆమె పాత్రలకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఒక వేళ ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాకుండా కూడా ఆమె పోషించిన పాత్ర ద్వారా మంచి పాపులారిటీ ని సొంతం చేసుకుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఆకట్టుకునే రూపం తో పాటు నటన ప్రతిభ డాన్స్ ప్రతిభ అద్భుతంగా కలిగి ఉన్న సాయి పల్లవి ఈ మధ్య కాలం లో కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదు.
దాదాపు సంవత్సర కాలం గా సాయి పల్లవి కొత్త సినిమాల ఊసే ఎత్తడం లేదు.
మొదట ఆమె ను సంప్రదించేందుకు ప్రయత్నించిన దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆమె గురించి పట్టించుకోవడం మానేశారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
"""/" /
ఆమె సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదని వారికి క్లారిటీ వచ్చేసింది.
అందుకే ఇక నుండి ఆమె ను సినిమాల్లో ఎంపిక చేసేందుకు ప్రయత్నించారని తేలి పోయింది.
అసలు సాయి పల్లవి ఎందుకు సినిమాలకు ఓకే చెప్పడం లేదు అనేది క్లారిటీ రావడం లేదు.
గత కొన్నాళ్లుగా సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీ కార్యక్రమాలకు కూడా ఎక్కువ హాజరు కావడం లేదు.
కారణం ఏంటి అంటే మాత్రం స్పష్టత లేదు.ఆ విషయం లో సాయి పల్లవి స్పష్టత ఇచ్చే వరకు ఆమె ను సినిమా ఇండస్ట్రీ నుండి దూరంగా ఉంచడం బెటర్ అంటూ కొందరు దర్శక నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా లపై ఆసక్తి లేని ఆమె ను బలవంతంగా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆమె తో సినిమాల్లో నటించా నటింపజేయాల్సిన అవసరమేంటి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
లేడీ పవర్ స్టార్ అంటూ ఆమె ను అభిమానిస్తున్న అభిమానులకు కనీస మర్యాద ఇవ్వకుండా సినిమాల్లో నటించకుంటే ఆమె ను ఏమనాలి అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి సాయి పల్లవి సినీ కెరియర్ విషయం లో రకరకాలుగా చర్చ జరుగుతుంది.
బయటపడాలి అంటే కొంత సమయం పడుతుంది… కెరియర్ పై పూజా హెగ్డే కామెంట్స్ వైరల్!