లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన లేడీ కానిస్టేబుల్.. వీడియో వైరల్!
TeluguStop.com
ప్రజలకు వచ్చిన సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ఉద్యోగులు కర్తవ్యం.కానీ కొంతమంది మాత్రం ప్రజల సమస్యలను పట్టించుకోరు ప్రతి విషయానికి వారికీ లంచాలు ఇస్తే కానీ కొంతమంది ప్రభుత్వ అధికారుల పెన్ను ముందుకు కదలదు.
వారు న్యాయంగా అది నిజమైనదో కాదో తెలుసుకుని దానిని అప్రూవల్ చేయాలి.కానీ లంచానికి అలవాటు పడే అధికారులు మాత్రం అవేమి పట్టించుకోకుండా లంచం ఇస్తే చాలు ముందు వెనుక ఆలోచించకుండా సంతకం పెడతారు.
మన దేశంలో లంచం ఇవ్వడం .తీసుకోవడం రెండు నేరం కిందకే వస్తాయి.
లంచం తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ నేరం అని తెలిసిన కొంతమంది మాత్రం దీనిని ఇప్పటికి ప్రోత్సహిస్తున్నారు.
వాళ్ళ పనులు జరగడం కోసం ఎంత డబ్బు అయినా ఇవ్వడానికి వెనుకాడరు.వాళ్ళను పట్టుకోలేరనే ధైర్యంతో చిన్న స్థాయి ఉద్యోగుల నుండి పెద్ద స్థాయి ఉద్యోగుల వరకు చాలా మంది ఇలా లంచాలు తీసుకుంటూ దొరికిపోతారు.
ఇప్పటికే చాలా మంది లంచం తీసుకుంటూ పోలీసులకు మీడియాకు దొరికిపోయిన ఇప్పటికి లంచం తీసుకోవడం మాత్రం ఆపడం లేదు.
లంచం తీసుకుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాల్సిన పోలీసే ఇప్పుడు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికి పోయింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఒక మహిళ కానిస్టేబుల్ లంచం తీసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
"""/"/
ఈ ఘటన యూపీ లోని బారాబంకి జిల్లాలో చోటు చేసుకుంది.దేవా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రీనా అనే మహిళ లంచం తీసుకుంటున్నప్పుడు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఒక వ్యక్తి తన పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చాడు.
మరొక కానిస్టేబుల్ కూడా లంచం తీసుకునేందుకు ఆమెకు సహకరించినట్టు ఈ వీడియో చుస్తే అర్ధం అవుతుంది.
"""/"/
కానీ పోలీస్ అధికారులు మాత్రం ఆ మహిళ కానిస్టేబుల్ ను మాత్రమే సస్పెండ్ చేయడాన్ని నెటిజెన్స్ వ్యతిరేకిస్తున్నారు.
అనిల్ సింగ్ దేవం అనే కానిస్టేబుల్ కూడా వీడియోలో కనిపించాడు.కానీ ఉన్నత అధికారులు కేవలం రీనా ను మాత్రమే విధుల నుండి తొలగించడంతో అతడిని కూడా తొలగించాలని నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు.