ట్రంప్ కి ఒక సింహం లాగా ప్రొటెక్షన్ అందించిన లేడీ కమాండో.. విజయశాంతి రేంజ్ లో సేవ్ చేసిందిగా

అమెరికా దేశం పెన్సిల్వేనియా( Pennsylvania ) రాష్ట్రంలో ట్రంప్ ఎన్నికల ప్రచారం చేస్తున్న ట్రంప్( Trump ) మీద ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

కంపెనీ చంపాలనే ఈ ఎటాక్ జరిగింది.అయితే అదృష్టం కొద్దీ ట్రంప్ ప్రాణాలతో తప్పించుకున్నారు.

అతని చెవి పైభాగంలో బుల్లెట్ తగిలింది.ఈ ఘటనతో యావత్ ప్రపంచం షాక్ గురైంది.

ఓ ఎత్తైన బిల్డింగ్‌పైన ఉండి బైనాక్యులర్స్ తో దూరంగా డయాస్ మీద ఉన్న ట్రంప్ కు గురి పెట్టి బుల్లెట్లు షూట్ చేశాడు సదరు దండకుడు.

ట్రంప్ వెంటనే కిందకి వంగారు.కొద్ది సెకన్ల తర్వాత ట్రంప్ సెక్యూరిటీ టీమ్ ఆ దుండగుడిని కాల్చేసింది.

అంతేకాకుండా డయాస్ మీద ఉన్న అతనికి కట్టుదిట్టమైన భద్రత అందించింది.ట్రంప్ ను సెక్యూరిటీ ఎలా కవర్ చేసిందో వైరల్ అయిన వీడియోలో మనం చూడవచ్చు .

మెరికల్లాంటి కమెండోలు స్టెన్ గన్లు పట్టుకొని అతడిని సురక్షితంగా కారులోకి ఎక్కించడం కూడా మనం గమనించవచ్చు.

ట్రంప్ ను కాల్చేసిన వెంటనే ఒక లేడీ సెక్యూరిటీ ఆఫీసర్( Lady Security Officer ) త్వరత్వరగా వచ్చారు.

ఒకవైపు బుల్లెట్ల వర్షం కురుస్తున్నా ఆ లేడీ ఆఫీసర్ ఒక మెరుపులాగా దూసుకొచ్చి ఫుల్ ప్రొటెక్షన్ ఆఫర్ చేశారు.

ఆమె ఒక ట్రెయిన్డ్ కమెండో( Trained Commando ) అని, ఆమె ప్యాంట్ బెల్టుకున్న రివాల్వర్ చూడటం ద్వారా అర్థమయింది.

"""/" / ట్రంప్ చుట్టూ అందరూ మేల్ కమెండోస్ యే కనిపించారు.అయితే వారందరిలో ఓ ఫీమేల్ కమెండో మాత్రమే ఉన్నారు.

అయినా అదే పడకుండా చాలా గట్స్ తన డ్యూటీ నిర్వర్తించారు.ట్రంప్‌ను లేపి అతని బాడీకి తన ప్రాణం అడ్డు వేస్తూ వేగంగా తీసుకెళ్లి బుల్లెట్ ప్రూఫ్ కారులో సురక్షితంగా చేర్చారు.

స్పాట్ నుంచి కారులోకి ఆమె తీసుకెళ్లిన తీరు చూస్తుంటే కర్తవ్యం సినిమాలో లేడీ లయన్ విజయ శాంతే ఎవరికైనా గుర్తుకు వస్తుంది.

"""/" / ఆడది అంటే అబల కాదు సబల అని ఈ అమెరికన్ లేడీ కమెండో మరోసారి ప్రపంచానికి తెలిసేలా ప్రూవ్ చేసింది.

అందరి నుంచి ప్రశంసలు అందుకుంటుంది.ట్రంప్ తన పై బుల్లెట్ల వర్షం కురిసిన కొంతసేపటికి ధైర్యంగా ఓ వీరుడిలా బిగించిన పిడికిలి పైకి చూపిస్తూ ఫైట్ ఫైట్ అనే అరిచారు.

బుల్లెట్ చెవికి తాకి రక్తం కారుతున్నా ఆయన భయపడలేదు.ఆ ధైర్యం, నాయకత్వ లక్షణం చాలామందికి నచ్చింది.

యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్‌లో భాగంగా ఆ లేడీ కమాండో ప్రొటెక్షన్ ఆఫర్ చేశారు.

మాజీ అధ్యక్షుల్ని, అధ్యక్షుల్ని కాపాడుతుంటారు.ఈ కమెండోలు చాలా కఠినమైన ట్రైనింగ్ తీసుకుంటారు.

వారు డ్యూటీలో ప్రాణాలను పోగొట్టుకోవడానికి కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

ఆ చిన్న తేడా వల్లే తమిళ హీరోల కంటే టాలీవుడ్ హీరోలు వెనుకబడ్డారా..?