లోక్ సభలో భద్రతాలోపం.. నెలకొన్న గందరగోళం

ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు లోక్ సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

లోక్ సభ గ్యాలరీ నుంచి గుర్తు తెలియని ఆగంతకుడు టియర్ గ్యాస్ సెల్స్ వదిలారని తెలుస్తోంది.

దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఎంపీలు బయటకు పరుగులు తీశారు.ఈ క్రమంలోనే సభను ప్యానెల్ స్పీకర్ వాయిదా వేశారు.

లోక్ సభలో భద్రతాలోపం నెలకొందని ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారని సమాచారం.

వెంటనే స్పందించిన సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.అనంతరం వారి వద్ద నుంచి టియర్ గ్యాస్ సెల్స్ ను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

కాగా 22 ఏళ్ల క్రితం ఇదే రోజు పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి జరిగిన సంగతి తెలిసిందే.

విశ్వనాథన్ భార్య చేసిన పనికి కార్ల్‌సన్ షాక్‌.. పొంగల్ వేడుకలో ఏం జరిగిందంటే?