టీడీపీలో ఎంపీ అభ్య‌ర్థుల కొర‌త‌.. కార‌ణమేమంటే !

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఎంపీ అభ్య‌ర్థుల కొర‌త ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వారిలో కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే విజ‌యం సాధించారు.

మిగిలిన 22 మంది ఓట‌మిపాల‌య్యారు.ఇక‌, వీరిలో ఇప్పు డు పార్టీలో యాక్టివ్ గా ఉన్న‌వారు చాలా త‌క్కువ మందే ఉన్నారు.

కొంద‌రు పార్టీ మారిపోయారు.మ‌రికొంద ‌రు పార్టీలోనే ఉన్నా కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

దీంతో పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ కుల కొర‌త పార్టీని వెంటాడుతోంది.ఇప్ప‌టి నుంచి అభ్య‌ర్థుల వేట‌సాగించ‌క‌పోతే.

పార్టీ ఇరుకున ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల వారిగా చూసుకుంటే నెల్లూరు నుంచి పోటీ చేసిన బీద మ‌స్తాన్ రావు, ఒంగోలు నుంచి పోటీకి దిగి ఓడిపోయిన మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావువైసీపీలోకి జంప్ చేశారు.

ఇక‌, రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన డీకే స‌త్య‌ప్ర‌భ ఇటీవ‌ల మృతి చెందారు.

అదేస‌మ‌యంలో పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ.గ‌త ఎన్నిక‌ల్లో చిత్తూరు నుంచి పోటీ చేసి ఓడిన శివ‌ప్ర‌సాద్ అనారోగ్యంతో మృతి చెందారు.

న‌ర‌సారావు పేట నుంచి పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావువృద్ధాప్య స‌మస్య‌లు ఎదుర్కొంటున్నారు.

"""/"/ ఇక‌, రాజ‌మండ్రి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప్ర‌ముఖ న‌టుడు, మాజీ ఎంపీ మాగంటి ముర‌ళీ మోహ‌న్ కోడ‌లు రూపాదేవి గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయారు.

ఇక‌, ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిన మాజీ ఎంపీ మాగంటి బాబు అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నారు.

కాకినాడ నుంచి సైకిల్ గుర్తుపై పోటీ చేసిన చెల‌మ‌ల శెట్టి సునీల్‌ అన‌కాప‌ల్లి నుంచి ఓడిపోయిన అడారి ఆనంద్‌కుమార్‌లు పార్టీకి దూర‌మ‌య్యారు.

ఇక‌, క‌ర్నూలు జిల్లాలో కీల‌క‌మైన నంద్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాండ్ర శివానంద‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు.

ఇక‌, క‌ర్నూలు నుంచి పోటీ చేసి ఓడిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి అడ‌పా ద‌డ‌పా పార్టీకార్య‌క్ర‌మాల‌కు వ‌స్తున్నారు.

అనంత‌పురం నుంచి ఓడిపోయినప్ప‌టికీ యువ నాయ‌కుడు జేసీ ప‌వ‌న్‌, హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పార్థ‌సార‌థి కూడా యాక్టివ్‌గానే ఉంటున్నారు.

ఇక‌, క‌డ‌ప నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

న‌ర‌సాపురం నుంచి పోటీ చేసి ఓడిన క‌లువ పూడి శివ‌ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

బాప‌ట్ల‌లో ఓడిన మాల్యాద్రి అడ్ర‌స్ లేకుండా పోయారు.ఎటొచ్చీ గ‌త ఎన్నిక‌ల్లో తిరుప‌తి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప‌న‌బాక ల‌క్ష్మి, త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న తిరుప‌తి ఉప ఎన్నిక‌లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మెంతులు, అరటి పండుతో ఇలా చేశారంటే మీ జుట్టు దట్టంగా పెరగడం గ్యారెంటీ..!