ప్రభుత్వ బడుల నిర్వహణకు నిధుల కొరత

ప్రభుత్వ బడుల నిర్వహణకు నిధుల కొరత

2022-23 స్కూల్ గ్రాంట్స్ విడుదలబ్ చేయని ప్రభుత్వం.కనీసం చాక్ పీసులు కొనలేని పరిస్థితి.

ప్రభుత్వ బడుల నిర్వహణకు నిధుల కొరత

దాతలపై ఆధారపడాల్సిన వైనం.ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు.

ప్రభుత్వ బడుల నిర్వహణకు నిధుల కొరత

నల్లగొండ జిల్లా:అనుముల మండలం హాలియా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ క్లిష్టతరంగా మారిందని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతీ ఏటా పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసేదని,బడులు ప్రారంభమై దాదాపు 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నిధులు విడుదల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో సర్కార్ బడుల్లో కనీసం చాక్ పీసులు కొనడానికి కూడా డబ్బులేక ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.

స్టేషనరీ కొనుగోలుతో పాటు పాఠశాల నిర్వహణకు నిర్దేశించిన మెయింటెనెన్స్,స్కూల్ గ్రాంట్ నిధులను సర్కార్ విడుదల చేయకపోవడంతో రిజిస్టర్లు,డస్టర్లు, చాక్పీసుల కొనుగోలుకు,పాఠశాలల నిర్వహణకు నిధుల కొరత ఏర్పడిందని ప్రభుత్వ ఉపాధ్యాయులు బయటికి చెప్పుకోలేక నానా అవస్థలు పడుతున్నారు.

గతంలో విద్యార్థుల సంఖ్య,గదుల లెక్క ప్రకారం మెయింటెనెన్స్,స్కూల్ గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేసేదని,2022-23 విద్యా సంవత్సరానికి గాను బడులు తెరిచి 15 రోజులు గడిచినా నిధులను విడుదల చేసే విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని మదనపడుతున్నారు.

బడిబాటను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు నిధుల కోసం దాతల సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు.

*నియోజకవర్గ వ్యాప్తంగా 350 పాఠశాలలు* నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలలు సుమారు 350 వరకు ఉన్నాయని,విద్యార్థుల సంఖ్య ప్రకారం ఒక్కో పాఠశాలకు రూ.

5 వేల నుంచి రూ.25 వేల వరకు స్కూల్ గ్రాంట్ విడుదల అయ్యేదని,ఈ గ్రాంటు నుంచి పాఠశాలకు ఆ విద్యా సంవత్సరంలో అవసరమైన స్టేషనరీని కొనుగోలు చేసేవారని, మెయింటెనెన్స్ గ్రాంట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడం,చిన్న మరమ్మతులు అవసరమైతే చేయించేవారమని,ఏ రకమైన నిధులు పాఠశాలలకు విడుదల కాకపోవడంతో నిర్వహణ భారంగా మారిందని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు.

గతంలో విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్లను కట్ చేశారని,విద్యుత్ సౌకర్యం లేకపోతే బోరుబావి నుంచి నీటిని ట్యాంకులకు ఎలా ఎక్కించాలని,అలాగే ఉక్కపోత నుంచి బయటపడటానికి ఫ్యాన్ లు వినియోగించడం తప్పనిసరని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.

ఇది ఇలా ఉండగా పాఠశాలలకు 2021-22 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం మంజూరు చేసిన స్కూల్ గ్రాంట్, మెయింటనెన్స్ గ్రాంట్ను పూర్తిగా గడిచిన మార్చిలో వెనక్కి తీసుకుందని,కొన్ని పాఠశాలల్లోనే నిధులు ఖర్చు కాగా అనేక పాఠశాలల నుంచి నిధులు పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని అంటున్నారు.

ఆ నిధులు ఉన్నా పాఠశాలలు నిర్వహణకు కొంతైనా మేలు జరిగేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేసి ప్రభుత్వ బడులను కాపాడాలని కోరుతున్నారు.

వామ్మో ఇది నిజమేనా.. 19 ఏళ్ల యువతికి సూపర్ పవర్ చేతులు.. తీసేసినా అవే కదుల్తాయ్!