ఉపాధి కూలీ గుండె పోటుతో మృతి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని ఏపూర్ గ్రామానికి చెందిన ఉపాధి కూలీ రావుల యల్లమ్మ (48)బుధవారం గుండె పోటుతో మృతి చెందారు.
రోజు మాదిరిగానే ఉపాధి హామీ పనికి వెళ్లి అస్వస్థత గురైంది.చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారని గ్రామస్తులు తెలిపారు.
మృతురాలు యల్లమ్మకు ఇద్దరు కుమారులు,కూతురు ఉన్నారు.భర్త గత10ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు.
ఆమె మృతదేహాన్ని ఏపీవో ఈశ్వర్,ఏపూర్ గ్రామ సర్పంచ్ సానబోయిన రజిత సుధాకర్,ఉప సర్పంచ్ అవిరే పద్మ అప్పయ్య,వార్డు సభ్యులు కారింగుల లింగయ్య, ఎఫ్ఏ శోభ పరిశీలించారు.
200 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా