పీ.హెచ్.సీ లో ల్యాబ్ టెక్నీషియన్ లేక రోగుల అవస్థలు…!

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు( Gurrampode ) మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ లేక నాలుగేళ్లుగా రోగులు నానా అవస్థలు పడుతున్నారు.

గత నాలుగేళ్ల క్రితం ఇక్కడ పని చేసిన లాబ్ టెక్నీషియన్ సుధీర్ ను డిప్టేషన్ పై టీ హబ్ కు పంపించారు.

అప్పటి నుండి ఇప్పటి వరకు మరో ల్యాబ్ టెక్నీషియన్( Lab Technician ) ని ప్రభుత్వం నియమించలేదు.

మధ్యలో ఒక ఆరు నెలలు ఔట్ సోర్సింగ్ వ్యక్తిని నియమించినా సాలరీ రావట్లేదని అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు తెలిసింది.

ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయి ల్యాబ్ టెక్నీషియన్ తో పాటు,పర్మినెంట్ స్టాఫ్ నర్స్ ని కూడా నియమించినట్లైతే రోగులకు పూర్తిస్థాయి వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని డా.

భవాని చక్రవర్తి తెలిపారు.

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ‘ సినిమాను నిఖిల్ అనవసరం గా చేశాడా..?