ఒక స్టార్ హీరోయిన్ కానీ రిటైర్మెంట్ వయసులో సాధించిన ఘనత ఏంటో తెలుసా ?
TeluguStop.com
ఎవరికి ఏ వయసులో ఎలాంటి బుద్ది పుడుతుందో ఎవరు చెప్పగలరు.కొన్ని సార్లు మన చుట్టూ ఉండే వాతావరణం మనల్ని కొన్ని పనులు చేసేలా ప్రోత్సహింస్తుంది.
వయసుతో సంబంధం లేకుండా మనం ముందుకు వెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమే.
ఆలా లేటు వయసులో ఎంతో గొప్ప గా ఘనత సాధించిన సీనియర్ హీరోయిన్ మరెవరో కాదు.
ప్రస్తుతం 80 ఏళ్ళ వయసు ఉన్న అలనాటి స్టార్ హీరోయిన్ ఎల్.విజయలక్ష్మి.
ఆమె ఇటీవల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో పాల్గొని ఆమె జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి వివరించారు.
మరి ముఖ్యంగా సినిమా ల నుంచి దూరం అయ్యాక ఒక సిఎ గా ఎలా మారారో వివరించింది.
ఇక విజయ లక్ష్మి కి చిన్నతనం నుంచి నాట్యం అంటే ఇష్టం ఉండటం తో స్థోమత లేకపోయినా ఆమె తండ్రి భారత నాట్యం లో శిక్షణ ఇప్పించారు.
ఆ తర్వాత కొన్నాళ్ళకు తెలుగు మరియు తమిళ్లో ఇక కాలంలో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.
తెలుగులో సిపాయి కూతురు సినిమాలో నటిస్తే తమిళ్ లో పంచాలి సినిమాలో నటించింది.
ఆ తర్వాత ఒక పదేళ్ల పాటు ఎన్నో సినిమాల్లో నటించి మంచి హీరోయిన్ గా స్థిర పడుతున్న సమయంలో తన సోదురుడి స్నేహితుడైన ఒక సైంటిస్ట్ ని వివాహం చేసుకుంది.
ఆ తర్వాత భర్త తో కలిసి ఇక్కడి నుంచి ఫిలిప్పీన్స్ వెళ్ళిపోయింది.అయితే అక్కడ విజయ లక్ష్మి మాత్రమే సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి.
"""/"/
మిగతా వారందరు సైంటిస్టులు, పీహెచ్‌డీ అందుకున్నవారు కావడం తో ఆమెకు కూడా చదువు పై ఇంట్రెస్ట్ కలిగింది.
అందుకోసం తొలి ప్రయత్నంగా వ్యవసాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించింది.ఆ తర్వాత అక్కడ నుంచి అమెరికా లో వెళ్లిపోయారు.
అమెరికాలో అకౌంటింగ్ పై పట్టు సాధించి సీఏ చదువును సైతం పూర్తి చేసింది.
అమెరికాలో దీన్ని సీపీఏ గా పిలుస్తారు.ఇక వర్జీనియా యూనివర్సిటీ లో మొదట అకౌంటెంట్‌గా ఉద్యోగం లో చేరింది.
ఆ తర్వాత బడ్జెట్ ప్లానర్ గా మారింది.ఆ తరువాత ఫైనాన్స్ అనలిస్టు గా పని చేయడం మొదలు పట్టింది.
ఇలా ఒకే యూనివర్సిటీ లో 17 ఏళ్లు పని చేసిన విజయ లక్ష్మి ప్రశుతం తమిళనాడులోనే సెటిల్ అయ్యింది.
ఇక ఆమె కొడుకు సిలికాన్ వ్యాలీ లో సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతున్నాడు.