సోది చెబుతానంటూ వచ్చి నిలువు దోపిడీ చేసిన కిలాడీ..

సోది చెబుతానంటూ వచ్చి నిలువు దోపిడీ చేసిన కిలాడీ

మన దేశంలో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు ఎక్కువ.టెక్నాలిజీ రోజురోజుకూ పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ప్రజలలో మార్పు రావడంలేదు.

సోది చెబుతానంటూ వచ్చి నిలువు దోపిడీ చేసిన కిలాడీ

ఎన్ని మోసాలు బయటపడ్డ ఇంకా పిచ్చిగా బాబాలను, సోది చెప్పేవారిని నమ్మి మోసపోతూనే ఉన్నారు.

సోది చెబుతానంటూ వచ్చి నిలువు దోపిడీ చేసిన కిలాడీ

తాజాగా సోది చెబుతానంటూ వచ్చిన ఒక మహిళ ఆ వీధిలోని ఇళ్లన్నీ ఖాళీ చేసి వెళ్ళింది.

ఈ సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.ఇప్పటికే ఎంతోమంది దొంగ బాబాలు దొరుకుతున్న ఇంకా కొంతమంది ప్రజలు గుడ్డిగా వారిని నమ్ముతూ మోసపోతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోఇలాంటి ఒక ఘటన చోటుచేసుకుంది.ఒక మహిళ సోది చెబుతానంటూ వచ్చింది.

అది నమ్మిన మహిళలు ఆమెను ఇంట్లోకి పిలిచారు.అంతే ఇల్లంతా నిలువు దోపిడీ చేసేసింది.

మహిళల మేడలో ఉండే బంగారాన్ని స్వాహా చేసేసింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లా ఉయ్యురులో మహిళ ఒక వీధిలోకి సోది చెబుతానంటూ వెళ్ళింది.

మీ ఇంటికి చేతబడి చేసారని ఆ ఇంట్లో ఉండే అత్త కోడళ్లను నమ్మించింది.

మీ మెడలోని బంగారాన్ని డబ్బాలో వేయాలని చెప్పింది.వారు అది నమ్మి అలాగే చేసారు.

తర్వాత ఏవేవో మంత్రాలు చదివి గొలుసులతో పారిపోయింది.వాళ్ళ బంగారాన్ని మొత్తం తెలివిగా కొట్టేసి అక్కడి నుండి తప్పించుకుంది.

ఆ విషయం తెలుసుకున్న మహిళలు లబోదిబోమని గుండెలు బాదుకుంటున్నారు.ఆ గొలుసులు మొత్తం 8 కాసులు ఉంటాయని ఆ మహిళలు చెబుతున్నారు.

మోసపోయామని గ్రహించిన ఆ మహిళలు వెంటనే ఉయ్యురు పోలీసులకు ఫిర్యాదు చేసారు.భాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కిలాడీ కోసం చుట్టుపక్కల ప్రాంతాలలో గాలిస్తున్నారు.

అక్కడ దగ్గరలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను బట్టి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అంతేకాదు ఇలాంటి మూఢనమ్మకాలను అస్సలు నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు.అలాంటివారు వచ్చి బంగారం కానీ, నగదు కానీ ఇవ్వమని అడిగితే అస్సలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.