కువైట్ కీలక నిర్ణయం...వలస వాసులకు భారీ ఊరట...
TeluguStop.com
కరోనా కారణంగా విదేశాలకు వెళ్లాల్సిన ఎంతో మంది వలస వాసులు వారి వారి దేశాలలో ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .
దాంతో ఎంతో మంది ఉపాధికి కోల్పోగా, కొందరు ఆర్థిక నష్టాలలో కూరుకు పోయారు.
అయితే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గు ముఖం పడుతున్న క్రమంలో అన్ని దేశాలు ఆంక్షలను సడలిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే లే కువైట్ తమ దేశంలోకి విదేశీయుల ఎంట్రీపై ఆంక్షలను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
గతంలో తమ దేశంలోకి వచ్చే వలస వాసులు తప్పకుండా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాల్సిందే నని కండిషన్స్ పెట్టిన కువైట్, తాజాగా వ్యాక్సిన్ లు వేసుకొని వారు సైతం కువైట్ రావచ్చునని ప్రకటించింది.
అయితే ఇలా కువైట్ వచ్చే ప్రయాణీకులకు మూడు కేటగిరీ లుగా విభజించింది .
1.వ్యాక్సిన్ పూర్తిగా తీసుకున్నవారు
2.
వ్యాక్సిన్ పూర్తి కానివారు
3.అసలు వ్యాక్సిన్ వేసుకొని వారు
వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుని బూస్టర్ డోసు వేసుకున్న వారు అలాగే కరోనా వచ్చి మూడు నెలలు పూర్తయిన వారు, వ్యాక్సిన్ పూర్తిగా తీసుకున్న వారి కేటగిరీ లోకి వస్తారు.
వీరికి ఎలాంటి RTPCR టెస్ట్ అవసరం లేదు పైగా హోమ్ క్వారంటైన్ కూడా అవసరం లేదు.
ఇక రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయి బూస్టర్ డోసు వేసుకొని వారు వ్యాక్సిన్ పూర్తికాని వారుగా గుర్తించ బడుతారు.
వీరికి ఎలాంటి RTPCR టెస్ట్ అవసరం లేదు కానీ వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి.
అలాగే సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారు, కువైట్ నిర్దేశించిన టీకా తీసుకొని వారు ఎరవైనా సరే వ్యాక్సిన్ తీసుకొని వారుగా పరిగణించ బడతారు.
ఇలాంటి వారు కువైట్ వచ్చే 72 గంటల ముందు తప్పనిసరిగా RTPCR చేయించుకుని దాని నెగిటివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుంది అలాగే కువైట్ వచ్చిన తరువాత 7 రోజుల పాటు క్వారంటైన్ ఉండి తదుపరి RTPCR టెస్ట్ చేయించుకోవాలని సూచించింది.
వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!