కువైట్ కోర్టు సంచలన తీర్పు...ప్రవాస భారతీయులకు 10 ఏళ్ళ జైలు శిక్ష...!!
TeluguStop.com
పరాయి దేశం వెళ్ళమంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, ఎలాంటి మోసాలకు పాల్పడి అక్కడ దొరికిపోయినా సరే ఖటినమైన శిక్షలు అనుభవించక తప్పదు.
కొందరు ఆయా దేశాల నియమ నిభందనలు సరిగా తెలుసుకోకుండా అక్కడి రూల్స్ కి విరుద్దంగా నడుచుకుని జైలు పాలు కాగా, ఇంకొందరు మాత్రం అడ్డ దారుల్లో డబ్బు సంపాదించడం కోసం తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు.
కానీ ఆయా దేశాలను మోసం చేసి అక్కడే జీవనం సాగించడం అనేది పులి నోట్లో తలకాయ పెట్టి పడుకున్నట్లే.
తాజాగా కొందరు భారతీయులు కువైట్ లో చేసిన నేరానికి 10 ఏళ్ళ పాటు జైలు జీవితం అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
వివరాలలోకి వెళ్తే.కువైట్ రూల్స్ కి పెట్టింది పేరు, అసలే తమ దేశంలో ఉన్న వలస వాసులను ఎలా గెంటేయాలా అని ఆలోచిస్తున్న కువైట్ కు కొందరు ప్రవాసులు అడ్డంగా దొరికిపోతున్నారు.
కువైట్ లో నకిలీ వైద్య పరీక్షలు చేసి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన కేసులో భారతీయులతో పాటు ఇతర దేశానికి చెందిన కొందరిని కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నివాస హోదా కోసం కువైట్ ప్రభుత్వం ఇచ్చే ధృవీకరణ పత్రం పొందాలంటే ప్రవాసులు తప్పనిసరిగా మెడికల్ టెస్ట్ లు చేయించుకుని దీర్ఘకాలిక వ్యాధులు తమకు లేవని చూపించాలి అప్పుడే వారికి పర్మిట్ ఇస్తారు అయితే """/"/
భారతీయులు, మరొక దేశానికి చెందిన మొత్తం 8 మంది ప్రవాసులు కలిసి పలు రకాల వ్యాధులతో బాధ పడుతున్న వారికి కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటూ పత్రాలు ఇచ్చారు.
వారు రెసిడెన్సీ కోసం అధికారులను కలిసి వారికి ఈ ధ్రువ పత్రాలు సమర్పించారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తిపై అనుమానం కలిగి ధ్రువ పత్రాలను తీసుకుని అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతడు తప్పుడు పత్రాలను సమర్పించాడని తెలుసుకున్న అధికారులు తమదైన శైలిలో తీగ లాగితే మొత్తం డొంక కదిలింది.
విచారణలో భాగంగా సుమారు ఆ 8 మంది ప్రవాసులను పక్కా సాక్ష్యాదారాలతో అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచగా కోర్టు వాటిని పరిశీలించి ఒక్కొక్కరికి 10 ఏళ్ళ పాటు జైలు జీవితం అనుభవించాలని తీర్పు చెప్పింది.
తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలిందా…వరుస వివాదాలలో టాలీవుడ్ సెలబ్రిటీస్!