కువైట్ లోని ఇండియన్ ఎంబసీ సంచలన నిర్ణయం...!!

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) ను దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 12 వ తేదీన నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ టెస్ట్ లో ఎంతో మంది విద్యార్దులు, ఎన్నారై విద్యార్ధులు కూడా పాల్గొంటారు.

అయితే ఈ సారి నీట్ పరీక్షను భారత్ లో మాత్రమే కాకుండా విదేశంలో కూడా ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం.

ఎంతో మంది ఎన్నారై విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని మొట్ట మొదటి సారిగా కువైట్ లో ఏర్పాటు చేయడంపై భారతీయ సంఘాలు, విద్యార్ధులు కృతజ్ఞతలు చెప్తున్నారు.

కువైట్ లో జరగనున్న నీట్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని అక్కడి భారత ఎంబసీ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 9 ,12 తేదీలలో పబ్లిక సర్వీసులు అన్నిటిని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించింది.

అయితే ఎమర్జెన్సీ సర్వీలులు మాత్రం అందుబాటులో ఉంటాయని, పేర్కొంది.అలాగే మూడు పాస్ పోర్ట్ కేంద్రాలు, వీసా ఔట్సొర్సింగ్ కేంద్రాలు కూడా అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

భారత ప్రభుత్వం మొట్ట మొదటి సారిగా విదేశాలలో నీట్ పరీక్ష నిర్వహిస్తోందని, అందుకు ప్రవాసులు సహకరించాలని ఎంబసీ కోరింది.

భారత ప్రభుత్వం కువైట్ లో నిర్వహించనున్న ఈ నీట్ పరీక్షను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే ప్రతీ ఏటా నిర్వహించే ఈ పరీక్షలలో పెద్ద ఎత్తున కువైట్ నుంచీ ప్రవాస విద్యార్ధులు రావడంతో ఎన్నారై కుటుంభాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

దాంతో ఎంతో మంది ఎన్నారై విద్యార్ధులు భారత్ రాకుండా కువైట్ లోనే పరీక్షకు హాజరుకావచ్చు.

ఇదిలాఉంటే భారత ప్రభుత్వం తమ అభ్యర్ధన దృష్టిలో పెట్టుకుని కువైట్ లో నీట్ ఏర్పాటు చేయడంతో ఎంతో మంది విద్యార్ధులకు మేలు జరుగుతోందని, ఎన్నారై సంఘాలు, విద్యార్ధుల తల్లి తండ్రులు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి తగిలిన జాక్‌పాట్.. ఎంతంటే..??