మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

బంగారిగడ్డ నుంచి భారీ ర్యాలీగా వచ్చిన కూసుకుంట్ల.చండూరు ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

ఈ భారీ ర్యాలీలో మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, వామపక్ష నేతలు పాల్గొన్నారు.

మరోవైపు ఒకరిని మించి ఒకరు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు.

అయితే రేపటితో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది.

బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు…. బాలయ్య పై ప్రశంసలు కురిపించిన ఊర్వశి!