‘ఖుషి’ 2 డేస్ కలెక్షన్స్.. అప్పుడే 50 కోట్ల క్లబ్ లో.. స్పీడ్ మామూలుగా లేదుగా!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) హీరోగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ లవ్ డ్రామా ''ఖుషి''( Kushi ).

శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు.

హేషం అబ్దుల్ సంగీతం అందించాడు. """/"/ ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకు పోతుంది.

ఎన్నో ఏళ్ల తర్వాత విజయ్ సాలిడ్ కమ్ బ్యాక్ తో వచ్చాడు.విజయ్ కు మాత్రమే కాదు సమంత( Samantha ) ఖాతాలో కూడా ఎన్నో రోజుల తర్వాత సాలిడ్ హిట్ అయితే పడింది.

ఇక ముందు నుండి భారీ ప్రమోషన్స్ తో అంతటా హైప్ పెంచేయడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ కుమ్మేసింది.

మొదటి రోజు ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 30.1 కోట్ల గ్రాస్( Kushi Movie Collections ) రాబట్టగా ఈ సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని ఎవ్వరు ఊహించలేదు.

ఇక పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు మరింతగా దూసుకు పోతుంది.తాజాగా మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చిన దాని ప్రకారం ఈ సినిమా రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 51 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్టు తెలిపారు.

"""/"/ దీంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్( Kushi Movie Two Days Collections ) లో చేరిపోయింది.

అలాగే యూఎస్ లో కూడా 1.1 మిలియన్ డాలర్స్ రాబట్టి అక్కడ కూడా సెన్సేషనల్ హిట్ గా దూసుకు పోతుంది.

మొత్తానికి విజయ్ ఈ స్థాయి కలెక్షన్స్ ను రాబడుతూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునే దిశగా దూసుకు పోతున్నాడు.

ఎట్టకేలకు ఖుషి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీగా ఉన్నారు.

డార్క్ అండర్ ఆర్మ్స్ తో చింతేలా.. నలుపును ఇలా వదిలించుకోండి..!