దూరం పెట్టారంటూ ప్రముఖ కోలీవుడ్ నటి ఖుష్బూ ఆవేదన.. అసలేం జరిగిందంటే?
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు తెలుగు సినీ నటి, జాతీయ మహిళా కమిషనర్ ఖుష్బూ సుందర్ ( National Women Commissioner Khushboo Sundar )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఖుష్బూ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు జబర్దస్త్ లాంటి షోలకు జెడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు రాజకీయాలలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు వార్తలు నిలుస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఖుష్బూ తమిళనాడు రాష్ట్ర బీజేపీ వర్గాలు తనను దూరం పెట్టాయి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
"""/" /
ఈ పరిస్థితులలో తన ఆవేదనను ఆమె ఒక తమిళ మీడియాతో పంచుకున్నారు.
తనను రాష్ట్ర బీజేపీ నేతలు( BJP Leaders ) దూరం పెట్టారని, తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, సమాచారం కూడా లేదంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఒకవేళ పిలిచినా అప్పటికప్పుడు పిలుస్తున్నారని తాను రావడం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చారు.
ఈ విషయంగా బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను ప్రశ్నించగా పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానాలు అన్నది తాను ఎవ్వరికీ ఇవ్వనని, ఈ వ్యవహారాలను పార్టీ నేత కేశవ వినాయగం( Kesava Vinayagam ) చూసుకుంటారని, ఖుష్బూ ఆరోపణల గురించి తనకు తెలియదంటూ దాట వేయడం గమనార్హం.
"""/" /
ఈ సందర్భంగా ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఖుష్బూ చేసిన అఖిలకు సంబంధించిన ఆడియోని సోషల్ మీడియాలో విడుదల చేయడంతో కదిరి మీడియాపై కూడా ఖుష్బూ మండిపడిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇకపోతే ఒకప్పుడు తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఖుష్బూ ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తోంది.
రాజకీయాల పరంగా కూడా బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.
రాజమౌళి మాదిరిగానే గోపీచంద్ మలినేని కూడా మరో పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడా..?