వైసీపీకి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా..!
TeluguStop.com
కర్నూలు జిల్లాలో( Kurnool District ) అధికార పార్టీకి వైసీపీకి షాక్ తగలింది.
ఆ పార్టీకి ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్( MP Dr.Sanjeev Kumar ) రాజీనామా చేయనున్నారు.
వైసీపీ అధిష్టానం ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోడంతో పార్టీ తీరుపై డాక్టర్ సంజీవ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.
"""/" /
సంజీవ్ కుమార్ ను కాదని మంత్రి జయరాంకు( Minister Jayaram ) పార్టీ హైకమాండ్ టికెట్ కేటాయించింది.
ఈ నేపథ్యంలోనే పార్టీని వీడనున్నారని తెలుస్తోంది.అయితే ఎంపీ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తానని సంజీవ్ కుమార్ ప్రకటించారు.
ఫిబ్రవరిలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న సంజీవ్ కుమార్ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.