”కుర్చీ మడత పెట్టి” సాంగ్ ప్రోమో.. గుంటూరోడితో శ్రీలీల అదిరిపోయే డాన్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మరో 15 రోజుల్లో మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది.

సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత మహేష్ చేస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ మూవీ ''గుంటూరు కారం''( Guntur Kaaram ).

ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అటు ఆడియెన్స్ తో పాటు ఇటు ఫ్యాన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో గత కొద్దీ రోజుల నుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.

"""/" / ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రచార చిత్రాలు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ నెలకొల్పేలా చేసాయి.

ఇక ఇప్పుడు మూడవ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు మేకర్స్.అంతేకాదు మూడవ పాట ''కుర్చీ మడత పెట్టి'' సాంగ్ ప్రోమోను కూడా కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా రిలీజ్ చేసారు.

మాస్ నంబర్ గా ఉన్న ఈ ప్రోమో అందరిని ఆకట్టుకుంటుంది.రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా థమన్ సంగీతం అందించారు.

కాగా ఈ సాంగ్ లో మహేష్, శ్రీలీల డాన్స్ అదిరిపోయింది.రేపు ఫుల్ సాంగ్స్ ను రిలీజ్ చేయనున్నారు.

"""/" / కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాలో శ్రీలీల ( SreeLeela) , మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi Babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.

ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

నాగచైతన్య తండేల్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ మ్యాజిక్ రిపీట్ కావడం పక్కా!