Chandrababu Naidu : కుప్పం వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదు..: చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ బహిరంగ సభ జరిగింది.ఈ సభలో పాల్గొన్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

టీడీపీకి బడుగు, బలహీన వర్గాల వారే బలమని చెప్పారు.ఈ క్రమంలోనే ఎన్నికల పర్యటనకు ముందు కుప్పం ప్రజల ఆశీస్సులు కోరుతున్నానన్నారు.

తనపై కుప్పం ప్రజలు ఏడుసార్లు అభిమానం చూపారన్న చంద్రబాబు( Chandrababu Naidu) కుప్పం అభివృద్ధిని వైసీపీ సర్కార్ పట్టించుకోలేదని తెలిపారు.

కుప్పం వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదని చెప్పారు. """/" / వైసీపీ నేతలు ఐదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా కుప్పంలో హింస, దోపిడీ రాజకీయాలు చేస్తున్నారన్నారు.తన జీవితంలో ఇలాంటి రాజకీయాలను ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే ఇక నుంచి మీ ఆటలు సాగవని తెలిపారు.

Validation Check 2026-03-24 19:38:18