కుప్పం బెటరా ? పులివెందులా ? ఇంతకీ అభివృద్ది జరిగింది ఎక్కడ?
TeluguStop.com
కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ గట్టి ప్రయత్నంలో ఉన్నారు.శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాట్లాడారు.
కుప్పంను పులివెందుల చేస్తానంటూ అక్కడి ప్రజలకు జగన్ హామి ఇచ్చారు.చంద్రబాబు కుప్పంలో ఏమీ చేయలేదంటూ.
అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఇక్కడ అభివృద్ది జరిగిందని గొప్పగా చెప్పుకోచ్చారు.అయితే జగన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేతలు మరుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారంటూ కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ సోషల్ మీడియా కుప్పంను చంద్రబాబు చాలా అభివృద్ది చేశారంటూ వివిధ ఉదాహరణాలు చూపిస్తూ జగన్‌ను టార్గెట్ చేస్తుంది.
సుందరంగా కనిపిస్తున్న కుప్పం.అద్భుతమైన రోడ్లు.
వైద్య కళశాలను చూపిస్తూ వీడియోలు ప్రదర్శిస్తున్నారు.అక్కడి ప్రజలకు వైద్య.
విద్యకు సంబందించిన ఎలాంటి లోటుపాట్లు లేవంటూ జగన్‌ను విమర్శిస్తున్నాయి.స్థానికులకు ఉపాది కల్పించడానికి చంద్రబాబు పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకు వచ్చారు.
దగ్గరలోని బెంగళూర్‌కు సులభంగా వెళ్ళేలా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయించగలిగారు.కుప్పం నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాలు పులివెందుల కంటే బాగున్నాయంటూ.
పులివెందులలో వైఎస్ కుటుంబం పుట్టి సాధించింది ఎంటీ అని.ఆ కుటుంబమే దశాబ్దాలుగా పెత్తనం చేస్తూ చెస్తుందని.
విమర్శిస్తున్నాయి. """/"/
ఇక టీడీపీ ఆరోపణలపై వైసీపీ అభిమానులు కూడా దీటుగానే స్పందిస్తున్నారు.
పులివెందుల అభివృద్ది ముందు కుప్పం ఎంత అంటూ విమర్శస్తున్నారు.రోడ్లు, ట్రిపుల్ ఐటీ, ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ ఘాట్, మోడల్ టౌన్ వంటివి ఉన్నయని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మిని శిల్పారామం, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట ప్రాంతాలలో అభివృద్ది పనులు జరుగుతన్నాయని కౌంటర్ ఇచ్చారు.
వైఎస్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో పులివెందులలో అనేక పనులు జరిగాయని.వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేశారన్నారు.
కేసు విషయం లో అల్లు అర్జున్ మీద ఉచ్చు బిగుస్తోందా.? ఆయన అరెస్టు అవ్వబోతున్నారా..?