Kumari Aunty : రెమ్యునరేషన్ గుట్టు విప్పిన కుమారి ఆంటీ.. సీరియళ్లు, షోలకు వెళ్తే ఆ డబ్బులే ఇచ్చారంటూ?
TeluguStop.com
సోషల్ మీడియా వల్ల ఈ మధ్య కాలంలో సామాన్యులు సైతం సెలబ్రిటీ స్టేటస్ ను అందుకుంటున్న సందర్భాలు ఉన్నాయి.
అలా సోషల్ మీడియా వల్ల పాపులర్ అయిన కుమారి ఆంటీ ( Kumari Aunty )ప్రస్తుతం సీరియళ్లు, టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు.
ఈ ఛానల్, ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా కుమారి ఆంటీ అన్ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు.
ఒక ఇంటర్వ్యూలో కుమారి ఆంటీ టీవీ షోలు, సీరియళ్ల( TV Shows And Serials ) గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడు, నాలుగు రోజుల డేట్స్ అడిగితే ఇవ్వలేదని ఆమె తెలిపారు.ఉదయం 5 గంటలకు వంట మొదలుపెడితే మధ్యాహ్నం 11 గంటలకు వంట పూర్తవుతుందని అమె చెప్పుకొచ్చారు.
అక్కడ వంట అమ్ముకుని వచ్చే సమయానికి 3 అవుతుందని కుమారి ఆంటీ వెల్లడించారు.
షూటింగ్ ఉందంటే మొత్తం సిద్ధం చేస్తానని మధ్యాహ్నం 3 గంటల తర్వాత షూట్ కు వస్తానని చెబుతానని ఆమె తెలిపారు.
"""/" /
యాక్టింగ్ కంటే వంట 1000 రెట్లు మేలని కుమారి ఆంటీ పేర్కొన్నారు.
చిరంజీవి గారికి అంత పేరు రావడానికి ఆయన టాలెంట్ కారణమని ఆమె తెలిపారు.
యాక్టింగ్ చేయడం కూడా సులువు ఆమె చెప్పుకొచ్చారు.నా బిజినెస్ వదిలి ఎక్కడికీ వెళ్లలేదని కుమారి ఆంటీ అన్నారు.
నేను రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని ఆమె తెలిపారు.నేను తీసుకెళ్లిన ఫుడ్ కు మాత్రమే డబ్బులు తీసుకున్నానని ఆమె తెలిపారు.
"""/" /
సీరియల్ కోసం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12.
30 గంటల వరకు పని చేశానని కుమారి ఆంటీ అన్నారు.సీరియల్ యూనిట్ హోటల్ కు వస్తానని చెప్పగా నేనే ఫుడ్ పంపిస్తానని చెప్పారని ఆమె తెలిపారు.
సుమ గారు కూడా నా పేరుతో వచ్చిన డీజే సాంగ్ కు రీల్ చేశారని చెబితే మొదట నమ్మలేదని కుమారి ఆంటీ చెప్పుకొచ్చారు.
ఈ పొడిని రోజుకో స్పూన్ చొప్పున తీసుకుంటే మీ బోన్స్ అవుతాయి సూపర్ స్ట్రాంగ్..!