రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకొని జీవనోపాధి జరుపుకుంటూ సెలబ్రెటీ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి వారిలో కుమారి ఆంటీ( Kumari Aunty ) ఒకరు.
ఈమె తక్కువ దొరికే ఫుడ్ విక్రయిస్తూ ఎంతో పాపులరిటీ సొంతం చేసుకున్నారు.ఇక ఈమె ఫుడ్ స్టాల్( Food Stall ) వద్దకు ఎంతోమంది యూట్యూబర్స్ ఇక్కడికి వెళ్లి ఆమెను ఇంటర్వ్యూ చేయడంతో ఈమె పాపులర్ అయ్యారు.
ఇకపోతే ఈమె పాపులారిటీ పెరిగిపోవడంతో ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ తినేవారు.
"""/" /
ఈ విధంగా ఫుడ్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.
దీంతో ట్రాఫిక్ పోలీసులు క్లోజ్ చేయించారు.ఇలా ఫుడ్ బిజినెస్ క్లోజ్ అవ్వడంతో ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చొరవ తీసుకొని తన ఆదేశాలతో తిరిగి తన ఫుడ్ బిజినెస్ ప్రారంభం అయ్యేలా చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈమె యధావిధిగా తన ఫుడ్ బిజినెస్ జరుపుకుంటుంది.
ఇకపోతే ఈ సంఘటన ద్వారా ఈమె మరింత పాపులర్ అయ్యారు. """/" /
ఈ ఘటన జరిగిన అనంతరం ఈమెకు బుల్లితెర కార్యక్రమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయనీ తెలుస్తుంది.
ఇలా రోజు రోజుకు ఈమె పాపులారిటీ విపరీతంగా పెరిగిపోవడంతో ఈమెకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
లేకపోతే తాజాగా ఈమె పేరిట ఫుడ్ బిజినెస్ విషయమై సోషల్ మీడియాలో వచ్చిన మాటలు, వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని డీజే పాట( DJ Song ) ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.