కమల్ పార్టీ నుండి రాజీనామా చేసిన కుమారవేల్..!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మక్కల్ నీధి మయ్యం పార్టీని స్థాపించి జరిగిన తమిళనాడు ఎలక్షన్స్ లో పోటీ చేశారు.

తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన కమల్ మక్కల్ నీధి మయ్యం పార్టీ ఒక్కచోట కూడా గెలవలేదు.

పార్టీ ఓటమిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.తద్వారా పార్టీకి రాజీనామాల వెల్లువ మొదలైంది.

ఇప్పటికే పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా చేయగా అదే దారిలో ఇప్పుడు క్మారవేల్ కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తుంది.

కమల్ హాసన్ పార్టీ స్థాపించినప్పటి నుండి సీకే కుమారవేల్ కీలకంగా వ్యవహరించారు.అయితే ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ పార్టీకి రాజీనామా చేయడం విశేషం.

ఎన్నికలకు సంబందించి ఆయన సరైన సజెషన్స్ ఇవ్వలేదని టాక్ కూడా వినిపించింది.అక్కడే ఉండి అవమానాలు పడటం ఎందుకని కమల్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు.

ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి పార్టీ నుండి రాజీనామాల పర్వం కొనసాగుతుంది.కుమారవేల్ తో కలిపి ఇప్పటి వరకు ఆరుగురు పార్టీని వీడినట్టు తెలుస్తుంది.

 పార్టీ తదుపరి చర్యలపై ఈమధ్యనే కమల్ హాసన్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడినట్టు తెలుస్తుంది.

ఒక్క స్థానం కూడా గెలవకపోవడం పార్టీ శ్రేణుల్లో నిరాశని మిగిల్చినట్టు తెలుస్తుంది. కమల్ హాసన్ మాత్రం పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

వైరల్ వీడియో: కారు ఓనర్ కు చుక్కలు చూపించిన కాకులు