కేటీఆర్ నల్లగొండ పర్యటన వాయిదా

నల్లగొండ జిల్లా:మంత్రి కేటీఆర్( KTR ) ఈనెల 15న నల్లగొండ పర్యటనకు రానున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం కేటీఆర్ విదేశీ టూర్ ఉన్న నేపథ్యంలోనల్లగొండ పర్యటన( Nalgonda Tour ) వాయిదా పడినట్లు తెలుస్తుంది.

మంత్రి కేటీఆర్ తన పర్యటన సందర్భంగా 123.52 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలతో పాటు కొత్తగా మంజూరైన మరో రూ.

590 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది.జూన్ 12 నుండి 15 వరకు జర్మనీలోని( Germany ) జరగనున్న ఆసియా బెర్లిన్ సదస్సు 2023 కు హాజరు కావాలని మంత్రి కేటీఆర్ ను నిర్వాహకులు ఆహ్వానించారు.

జర్మనీ సెనెట్ డిపార్ట్మెంట్ ఫర్ ఎకనామిక్స్ ఎనర్జీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం పంపింది.

వారి ఆహ్వానం మేరకు మంత్రి కేటీఆర్ జర్మనీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.

అదే జరిగితే మంత్రి నల్లగొండ పర్యటన ఖాయంగా వాయిదా పడ్డట్లే కనిపిస్తుంది.

ఫుట్‌బాల్ మైదానాన్ని మింగేసిన సింక్ హోల్.. వీడియో వైరల్..