భూదాన్‌ పోచంపల్లిలో నేడు కేటీఆర్ పర్యటన

యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లాల్లో నేత చీరలకుఆ ప్రసిద్ధిగాంచిన భూదాన్‌ పోచంపల్లిలో మంత్రి కేటీఆర్‌( Minister KTR ) నేడు పర్యటించనున్నారు.

ఉదయం 11 గంటలకు పట్టణానికి చేరుకుంటారు.మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఇందులో భాగంగా సాయిని భరత్‌ ఇంటిగ్రేటెడ్‌ హ్యాండ్లూమ్‌ యూనిట్‌ ప్రారంభిస్తారు.పోచంపల్లిలోని ప్రధాన రహదారిపై పోలీస్‌స్టేషన్‌ వద్ద పద్మశాలీ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

దీంతోపాటు సమీకృత వెజ్‌,నాన్‌ వెజ్‌ మారెట్‌, ధోబీ ఘాట్‌,మురుగు కాల్వలు,సీసీ రోడ్ల శంకుస్థాపనలో పాల్గొంటారు.

అనంతరం చేనేత వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించనున్నారు.పర్యటన వివరాలుఉదయం 11గంటలకు సాయిని భరత్‌ ఇంటిగ్రేటెడ్‌ హ్యాండ్లూమ్‌ యూనిట్‌ ప్రారంభం,11.

30కు నేతన్న విగ్రహావిషరణ చేయనున్నారు.11.

40 గంటలకు రూ.2 కోట్లతో నిర్మించే సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మారెట్‌కు శంకుస్థాపన,రెండు కోట్లతో నిర్మించే ధోబీఘాట్‌, రూ.

5.17 కోట్లతో అన్ని వార్డుల్లో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో చేనేత వారోత్సవ సభలో ప్రసంగిస్తారు.

డాకు మహారాజ్ ప్రమోషన్స్ విషయంలో అసంతృప్తిలో అభిమానులు.. రికార్డులు క్రియేటవుతాయా?