పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి ‘  కేటీఆర్ సెటైర్లు 

'' పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట '' అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( BRS Working President KTR )తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పైన తీవ్ర విమర్శలతో కేటీఆర్ విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

ఇదే క్రమంలో కేటీఆర్ తన విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు.తెలంగాణ ప్రజల జీవితాలలో కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పులు పోసిందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

  ప్రజల భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం తమ భూములు లాక్కోవద్దని ఎదురు తిరిగిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేయిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

సంక్షేమ , గురుకుల పాఠశాలల ఆహార బిల్లులు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే గాని , తొమ్మిది నెలలకు మూడు నెలల బిల్లులు చెల్లించారు .

"""/" / కానీ వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు.

  11 నెలల పాలనలో సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేసారు.

  36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారు.వందలాది గురుకుల పాఠశాలలో వసతి గృహాల విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు.

పత్తి, వరి, ధాన్యం కొనుగోలు చేపట్టక ఆందోళన చేసినా,  ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రైతన్నలు అడ్డుకి పావుశేరు కింద తమ ఆరుగాలం కష్టాన్ని అమ్ముకుంటున్నారు.

"""/" / హైడ్రా,  మూసి ( Hydra, Shut Up )సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులు పోసి కంటికి కునుకు లేకుండా చేశారు.

ఫార్మాసిటీకి సేకరించిన భూమిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారు.

  మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైలకు పంపుతున్నారు 11 నెలల పాలనలో సంక్షేమం మాయమైంది.

అభివృద్ధి దూరమయింది.కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెర పోతుంది .

కాలం రాగానే కాటేసి తీరాలని ఎదురుచూస్తుంది.అంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేశారు.

అల్లు అర్జున్ కేసు విషయంలో ఏం జరుగుతుంది..?