మెట్రో మృతిపై కేటీఆర్‌ ఆగ్రహం

హైదరాబాద్‌లో కొత్తగా నిర్మాణం అయిన మెట్రో రైల్‌ ఇంకా పూర్తి స్థాయిలో సేవలు అందించనే లేదు.

అప్పుడే కట్టుబడిలో లోపాలు కనిపిస్తున్నాయి.అమీర్‌ పేటలోని మెట్రో స్టేషన్‌లో పై నుండి పెచ్చులు ఊడి పడి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన మౌనిక మృతి చెందడం జరిగింది.

అక్కడిక్కడే ఆమె మృతి చెందడంతో మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ మరియు ప్రభుత్వం తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమయంలోనే మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ మెట్రో ప్రాజెక్ట్‌ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.అమీర్‌ పేట మెట్రో స్టేషన్‌లో జరిగిన సంఘటన బాధకరం అన్నారు.

ఈ సంఘటనపై సీనియర్‌ ఇంజనీర్లతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నాడు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మెట్రో యాజమాన్యంపై ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అన్ని మెట్రో స్టేషన్స్‌లో ఇలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇంజనీర్ల బృందం అన్ని మెట్రో స్టేషన్‌లను పరిశీలించబోతున్నట్లుగా కేటీఆర్‌ ప్రకటించాడు.